ఫుడ్ కోర్ట్‌లను పై అంతస్తుల్లో ఏర్పాటు చెయ్యడానికి కారణాలు ఇవే..!

-

సహజంగా వీకెండ్స్ లో మాల్స్ కు, రెస్టారెంట్ల కు లేక సినిమాలకు సమయాన్ని గడపడానికి వెళుతూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా మాల్స్ లో తిరిగి చివరకు ఫుడ్ తిని ఇంటికి వస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం ఫుడ్ కోర్ట్స్ అనేవి పై అంతస్తులో ఉంటాయి. ఫుడ్ స్టాల్ల్స్ లో పేమెంట్ చెయ్యడానికి ఈటరీ కార్డు వంటివి కచ్చితంగా పెడుతూ ఉంటారు. అంతేకాకుండా సెల్ఫ్ సర్వీస్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటాయి. కేవలం కొన్ని ప్రదేశాలలో మాత్రమే డెబిట్ లేక క్రెడిట్ కార్డ్ వినియోగం కూడా ఉంటాయి.

అంతేకాకుండా ఇదే పద్ధతిను ఎయిర్పోర్ట్స్, షాపింగ్ మాల్స్, రెసిడెన్షియల్ సొసైటీస్ కూడా పాటిస్తూ ఉంటాయి. ఇలాంటి పద్ధతులు ప్రస్తుతం కొన్ని ఫుడ్ బ్రాండ్స్ మరియు క్యాంటీన్స్ కూడా ఫాలో అవుతున్నాయి అనే చెప్పవచ్చు. ఎప్పుడైతే షాపింగ్ మాల్స్ లో ఫుడ్ కోర్ట్స్ కింద ఫ్లోర్ లో ఉంటాయో ఆలోచన షాపింగ్ పై ఉండదు. పైగా ఎంతో త్వరగా ఆలోచనలు మారిపోతాయి. ఎప్పుడైతే ఫుడ్ కోర్ట్ కు ఎక్కువ స్థలాన్ని కేటాయించి మంచి డిస్ప్లే ను చేస్తారో కస్టమర్ ఆసక్తికరంగా ఉంటారు మరియు ఆహారాన్ని కొనుగోలు చేస్తారు.

ముఖ్యంగా కొత్త అవుట్ లెట్స్ ను చూసి ప్రయత్నించాలి అనే ఆలోచన వస్తుంది. ఈ విధంగా ఫుడ్ ఫ్లోర్ లో మంచి వ్యాపారం అవుతుంది అనే చెప్పవచ్చు. సహజంగా పెర్ఫ్యూమ్ వంటి ప్రొడక్ట్స్ కు సంబంధించిన దుకాణాలు ఎప్పుడూ రెండవ లేక మూడవ అంతస్తులలో పెట్టరు. ఎందుకంటే అంతస్తులు పెరిగే కొద్దీ సువాసన పై ఏకాగ్రత ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే పై అంతస్తులలో ఫుడ్ కోర్టులను పెడతారో ఆకలి కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. పైగా ఇతర అంతస్తుల లో ఫుడ్ కోర్ట్స్ ను పెట్టడం వలన షాపింగ్ మాల్ అందంగా కూడా కనపడదు. ఎంతో శుభ్రంగా మరియు విశాలంగా కనిపించాలంటే కచ్చితంగా ఫుడ్ కోర్ట్స్ ను పై అంతస్తులోనే పెట్టడం మేలు.

Read more RELATED
Recommended to you

Latest news