పెళ్లి మీదకు మనసు మళ్లీందా..? పెళ్లి జీవితం హ్యాపీగా సాగిపోవాలంటే పాటించాల్సిన రూల్స్ ఇవే..

-

ఆల్రెడీ ఒంటి మీదకు 30 ఏళ్లు వచ్చాయి, ఇంకా ఎన్ని రోజులు సింగిల్ గానే ఉంటాం.. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని మీరు అనుకుంటే.. పెళ్లి జీవితం హ్యాపీగా సాగిపోవడానికి ఎలాంటి లక్షణాలు అలవర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

పెళ్లి తర్వాత జీవితంలో కచ్చితంగా మార్పు వస్తుంది. దానిని ఎవ్వరూ కాదనలేరు. పెళ్లికి ముందు ఉన్నట్టుగా పెళ్లి తర్వాత కూడా ఉండాలని అనుకోవడం శుద్ధ పొరపాటు. ఒక గదిలో ఒంటరిగా మీరు మీకు నచ్చినట్టుగా ఉంటారు, అదే పదిమందిలోకి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఉండలేరు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంతే.

పగలు, ప్రతీకారాలు వద్దు:

ఇద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం చాలా సహజం. అయితే వాటిని ఎంత తొందరగా మరచిపోతామన్నది ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని తొందరగా మరచిపోయి ముందుకు సాగిపోవాలి కానీ.. గుర్తుంచుకుని పగ తీర్చుకుందాం అని అనుకుంటే బంధం ముందుకు కదలదు.

మీ భాగస్వామిని పొగడ్తలతో ముంచేయండి:

పొగడ్త నచ్చని మనిషి ఎవ్వరూ ఉండరు. భాగస్వామి నుండి పొగడ్త వస్తే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. మీరు మీ భాగస్వామిని అప్పుడప్పుడు పొగుడుతూ ఉండాలి.

హాస్యం అతి ప్రధానం:

బంధం లో ఉన్న ఇద్దరూ ఎప్పుడూ సీరియస్ గా ఉంటే బోర్ కొట్టేస్తుంది. లైఫ్ లో కష్టాలు, సుఖాలు వస్తూనే ఉంటాయి. వాటిని ఆస్వాదిస్తూనే నవ్వుని ఆసరాగా చేసుకుని.. మీ భాగస్వామిని నవ్విస్తూ ముందుకు సాగిపోవాలి.

ఎదగడంలో ప్రోత్సాహం:

జీవితంలో ఎదగటానికి ఇద్దరూ ప్రోత్సాహం ఇచ్చుకోవాలి. ఇద్దరి లక్ష్యాలు వేర్వేరు అయినా కూడా.. వాటిని గౌరవించుకుని, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎదగాలి.

క్వాలిటీ టైం:

ప్రస్తుత ప్రపంచంలో అందరూ బిజీగా మారిపోయారు. పెళ్లయింది కదా అని ఇంకా ఎక్కువగా పని చేస్తూ మీరు బిజీగా మారిపోవద్దు. మీ భాగస్వామికి టైం ఇవ్వండి. మీ జీవితం హాయిగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version