భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రాంచీలో తన భార్య సాక్షితో కలిసి ఓటు వేసేందుకు వచ్చాడు. 2020లో అంతర్జాతీయ క్రెకెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మిస్టర్ కూల్ తన సొంత రాష్ట్రమైన ఝార్ఖండ్ లోనే జీవితాన్ని గడుపుతున్ననాడు. పలు సందర్భాల్లో ధోనీ బహిరంగంగా కనిపించిన వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. జార్ఖండ్‌లో మొదలైన ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ధోనీ ఫ్యామిలీతో కలిసి వచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. అందులో ధోనీ గట్టి భద్రత మధ్య పోలీంగ్ బూత్ లోకి ప్రవేశిస్తున్నట్టు కనిపించాడు. అప్పటికే అతడిని స్థానిక జనం, అభిమానులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో స్వల్ప ఇబ్బందికి గురైన ఈ క్రికెటర్ ను పోలీసులు భద్రతా సిబ్బంది కలిసి లోపలికి పంపించారు. ఈ సెలబ్రిటీ రాకతో కొంతసేపు బూత్ వద్ద హడావుడి వాతావరణం నెలకొంది.
Brand Ambassador of Jharkhand Assembly Elections MS Dhoni has arrived to cast his vote ❤️😎👌#MSDhoni #JharkhandElections pic.twitter.com/oRwFkcKxng
— Chakri Dhoni (@ChakriDhonii) November 13, 2024