508 సైబర్ కేసుల్లో భాగస్వాములుగా ఉన్న 48 మంది అరెస్టు..!

-

సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం తెలంగాణలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సైబర్ నేరగాళ్ళకు మ్యూల్ అకౌంట్లను సమకూర్చే వారిని అరెస్టు చేసాం. 508 కేసుల్లో భాగస్వాములుగా ఉన్నా 48 మంది నిందితులను అరెస్టు చేశాము. నిందితులకు దేశవ్యాప్తంగా 2194 కేసుల్లో పాత్ర ఉంది. నిందితులు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు బాధితుల నుండి కొల్లగొట్టడానికి సైబర్ నేరగాలకు సహకరించారు. అరెస్ట్ అయినా వారిలో 38 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు. 10 మంది ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్లు ఆధార్ పాన్ కార్డు తీసుకుని ఖాతాలు ఓపెన్ చేస్తారు. ఆయా ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడి కొల్లగొట్టిన డబ్బును ఆ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మ్యూల్ అకౌంట్లు సమకూర్చి పట్టుబడ్డ వారిలో విద్యావంతులు ఉన్నారు .ఈ మ్యూల్ అకౌంట్ హోల్డర్లందరూ తెలంగాణతో పాటు దేశంలో కూడా పలు కేసుల్లో చిక్కుకున్నారు. ఈ 48 మంది అరెస్టయిన వ్యక్తులలో క్యాబ్ డ్రైవర్లు, చిన్న వ్యాపార యజమానులు ఉన్నారు. 22 మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉన్నారు. నిందితులు ట్రై కమిషనరేట్ పరిధితో పాటు నిజామాబాద్, రామగుండం ప్రాంతాలలో జరిగిన నేరాలకు మ్యూల్ ఖాతాలు ఇచ్చారు. సైబర్ నేరగాళ్లకు, బ్యాంక్ అకౌంట్ సమకూర్చే ఏజెంట్ లకు పరిచయం ఉండదు. వీరంతా టెలిగ్రాం,లాంటి సోషల్ మీడియా యాప్ ల ద్వారా మాట్లాడుకుంటారు అని శిఖా గోయల్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version