రూపాయికే లీటరు పెట్రోల్‌.. ఎక్క‌డో తెలుసా?

-

మ‌న దేశంలో పెట్రోల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు పెట్రోల్ రేట్టు మ‌న దేశంలో భ‌గ్గుమంటున్నాయి. ఇక గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా లీట‌రు పెట్రోల్ రూ.100వ‌ర‌కు పెరిగింది. దీంతో సామాన్య జ‌నం పెట్రోల్ అంటేనే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కేవ‌లం రూపాయి, రెండు రూపాయ‌ల‌కే లీట‌ర్ పెట్రోల్ వ‌స్తోంది. ఏంటి న‌మ్మ‌ట్లేదా? నిజ‌మండి అదెక్క‌డో ఇప్పుడు చూద్దాం.

వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూ1.46 మాత్రమే. ఇక్క‌డ మంచినీళ్ల కంటే పెట్రోల్ చీప్‌గా దొరుకుతుంది. ఇక ఇరాన్‌లో అయితే రూ.4.24 లీటరు పెట్రోల్ వ‌స్తుంది. అలాగే అంగోలాలో లీటరు పెట్రోల్ రూ.17.88కు దొరుకుతోంది.

ఇదిలా ఉంటే కొన్ని దేశాల్లో అయితే లీట‌రు పెట్రోల్ రేటు 100కంటే ఎక్కువే ఉంది. అదెక్క‌డ అంటే.. హాంగ్ కాంగ్‌లో లీటరు ధర రూ.169.21గా ఉంటే, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో రూ.150, సిరియాలో రూ.149 గా ఉంది. అలాగే నెదర్లాండ్స్‌లో కూడా పెట్రోల్ రేటు లీటరుకు రూ.140 వద్ద ఉంద‌ని ఆ దేశాలు చెబుతున్నాయి. ఇలా కొన్ని దేశాల్లో పెట్రోల్ రేటు చీప్‌గా ఉంటే.. మ‌రికొన్ని దేశాల్లో తారా స్థాయిలో ఉంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version