పెళ్ళి తర్వాత ఇద్దరి మధ్య శృంగారం జీవితం సక్రమంగా ఉండడమనేది చాలా ముఖ్యం. పెళ్ళయ్యాక ప్రేమ ఎంత ముఖ్యమో సెక్స్ కూడా అంతే ముఖ్యం. ఐతే చాలాసార్లు ఒకరిపై ఒకరికి ఇష్టం లేకనో, ఇంకే కారణం వల్లనో సెక్స్ మీద ఆసక్తి చూపించకుండా తయారవుతారు. అలాంటపుడు అవతలి వారికి ఇబ్బంది కలుగుతుంటుంది. కొన్నిసార్లు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. వైవాహిక జీవితంలో శృంగారం కొరవడిన మగాళ్ళు ఎదుర్కునే ఆరోగ్య ఇబ్బందులేమిటో చూద్దాం.
కోపం, చిరాకు
సెక్స్ లైఫ్ సరిగ్గా లేని మగాళ్ళు చిరాకుకి ఎక్కువగా గురవుతారట. తమ భాగస్వామి సెక్స్ కి నిరాకరించడం వల్ల కోపం కోపం పెరిగి అది నిరంతరం వారినే అంటిపెట్టుకుంటుంది. అది ఇతరులపై కూడా కనబడుతుంది. దానివల్ల సమాజంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మానసికంగా ఎలాంటి ఎమోషన్ లేకపోవడం
సెక్స్ లేని జీవితంలో తమ భాగస్వామితో మానసికంగా దగ్గర కాలేకపోతారు. అవతలి వారు దూరం జరుగుతున్నారన్న ఫీలింగ్, తమని మరింతగా బాధపెడుతుంది. అప్పుడు తమకి ఎవరూ లేరు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది మానసికంగా వారిని కుంగదీస్తుంది.
ఒత్తిడి
అధ్యయనం ప్రకారం ఎవరైతే క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటారో వారు తక్కువ ఒత్తిడిని కలిగి ఉంటారు. అదే శృంగారం జీవితానికి దూరమైన వారు ఒత్తిడిని అంటిపెట్టుకుని, దాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇది చాలా సహజంగా జరుగుందని, తెలియకుండానే ఇబ్బంది పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదీగాక ఇలా ఊరికే చిరాకు పడుతూ, ఒత్తిడికి లోనయ్యే మగాళ్ళలో అంగస్తంభన సమస్యలు వచ్చే పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.