ఇది ఒక గ్రామం. ఈ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. ప్రజలు పక్క ఊరికి వెళ్లినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. గొళ్లెం, తాళాల ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది.
ఆ ఊరే `శనిసింగనాపూర్`. శింగనాపూర్ షిరిడి మరియు ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది. అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు చేయించడం లేదు. ఒకవేళ దొంగ తనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు శనిరూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. అంత పవర్ ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది. మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్యక్షేత్రం.
ఇక్కడ ఆ పరమాత్ముడు అరుబయటనే ఉంటాడు. ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండక పోవడం ఇక్కడ ఉన్న విశిష్టత. శని శింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు. శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగనాపూర్ను దర్శిస్తారు. ఇది ఇక్కడ విశిష్టత..!