భారత్ లో కుంభమేళా గురించి మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది కదా…? 12 నదులకు ప్రతీ ఏటా జరిగే పుష్కరాల గురించి కూడా మీకు అవగాహన ఉంటుంది. కోట్లాది మంది ప్రజలు పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు నదుల్లో. గోదావరి, కృష్ణా, కావేరి, గంగా ఇలా ఎన్నో నదుల్లో భక్తులు పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు. తమ పవిత్రతను చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
పవిత్ర నదుల ప్రతీ పుష్కరంలో కూడా మన దేశ ప్రజలు స్నానాలు చేయడంతో పాటుగా నదుల్లో మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇతర దేశాల్లో…? వాళ్ళ మతాలు ఆచారాలు ప్రకారం మనకు మాదిరిగా ఏ గోలా ఉండదు. అయితే వారి ఆహారపు అలవాట్లు కూడా కాస్త భిన్నంగా ఉంటాయి మనకు మాదిరి వాళ్ళ ఆహారపు అలవాట్లకు ఒక పద్ధతి ఉండదు.
కాని ఈ స్థాయిలో మన దేశంలో పుష్కరాల పేరిట కుంభమేళాల పేరిట ఒకేసారి లక్షలు, కోట్ల మంది నదుల్లో మునుగుతూ ఉంటారు. అయినా సరే ఒక్క వైరస్ కూడా మన దేశాన్ని వేధించలేదు. ఒక్క వైరస్ కూడా మన దేశంలో ఇప్పటి వరకు పుట్టినట్టు ఎక్కడా లేదు. ఇతరదేశాల్లో పుట్టిన వైరస్ లు మన దేశానికి వచ్చి మనని ఇబ్బంది పెట్టడమే గాని మన దేశంలో పుట్టి ఏ దేశాన్ని వైరస్ లు ఇబ్బంది పెట్టలేదు.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ పుట్టింది కాంగోలో… మొదటి నిఫా కేస్ బయటపడింది మలేషియాలో, మొదటి ఎబోలా కేస్ బయటపడింది దక్షిణ సుడాన్ లో… మొదటి బర్డ్ ఫ్లూ కేసు బయటకు వచ్చింది హాంకాంగ్ లో… మొదటి డెంగ్యూ కేసు బయటపడింది మనీలాలో మొదటి కరోనా కేసు బయటపడింది చైనాలో… మన దేశంలో ఇప్పటి వరకు ఏ వైరస్ పుట్టలేదు. దీనికి కారణం మనదేశంలో ఉండే ఆహారపు అలవాట్లు… మన పెద్దల నుంచి మనం నేర్చుకున్న శాస్త్రీయ పద్దతులు.. అవే మన దేశానికి రక్షణగా నిలుస్తూ వస్తున్నాయి.