భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య… ఇదేం వింతరా బాబు… స్టొరీ తెలిస్తే…

-

తన కుటుంబం పరువు పోతుందని భావించిన ఒక భార్య తన భర్తకు పెళ్లి చేసిన ఘటన ఒరిస్సాలో చోటు చేసుకుంది. సాధారణంగా భర్త ఎవరితో అయినా వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతని భార్యకు నిద్ర పట్టదు… అలాంటి ఏకంగా ఒక భార్య తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయికి ఇచ్చి వివాహం చేసింది. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసి అనే వ్యక్తికి గాయత్రి అనే మహిళతో వివాహం జరిగింది. అంతా సంతోషంగా సాగిపోతున్న తరుణంలో…

కావసికి అదే ఊరుకి చెందిన ఐత మడకామి అనే యువతితో పరిచయం ఏర్పడటం… ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. దీనితో ఆమె కావసి తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. నాకు పెళ్లి అయింది కుదరదు అని చెప్పినా ఆమె వినలేదు. దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి గాయత్రికి తెలిసింది. జరగాల్సింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మార్చేది లేదని భావించిన గాయత్రి, కుటుంబ పరువు పోతుందని, సమాజం తమను చిన్న చూపు చూస్తుందని భావించి,

ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తన భర్తకు ఆ అమ్మాయికి వివాహం చెయ్యాలని భావించింది. తన అత్తమామలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరితో మాట్లాడి పరిస్థితి వివరించి, అనుకున్నదే తడవుగా తంతు అంతా కానిచ్చింది. ఊరిలోని సిద్ధి ఈశ్వర్‌ గుడిలో తన భర్తకు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసింది. ఈ విధంగా చేస్తే తన భర్త తనతో పాటు తన ఊళ్లోనే ఉంటాడు అని అప్పుడు ఏ ఇబ్బందులు ఉండవని భావించి ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. ఇక వివాహానికి గ్రామస్తులు అందరిని పిలిచింది గాయత్రి… ఈ వివాదం ఇక్కడితో సద్దుమణగడం తో పోలీసులు కేసును కొట్టేసారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version