కొవిడ్‌ తర్వాత గణనీయంగా పెరిగిన గుండెజబ్బులు.. తేల్చిన సర్వే..!!

-

కొవిడ్‌ తర్వాత చాలమంది ఆరోగ్యం దెబ్బతింది.. ముఖ్యంగా యువత రకరకాల సమస్యతో బాధపడుతున్నారు..మునపటిలా లేదు..త్వరగా అలిసిపోతున్నారు, ఆయాసం, నీరసం, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. నిజానికి టీకా వేసుకున్న వారిలోనూ ఈ సమస్యలు అధికంగానే ఉంటున్నాయి.. కొవిడ్‌ తర్వాత అంతే వేగంగా గుండె జబ్బులు పెరిగాయి.. కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరంలో యూఎస్‌లో కార్డియోవాస్కులర్ డిసీజ్(cvd)తో 2019లో 8,74,613 మంది చనిపోయారు. 2020లో ఆ సంఖ్య 9,28,741 పెరిగినట్లు కొత్త అధ్యయనం వెల్లడించింది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం.. 2020లో సీవీడీ మరణాల సంఖ్య 2015 కంటే భారీగా నమోదయ్యందని తేలింది..ఇంత స్థాయి మరణాల రేటు 2003లో 9,10,000 నమోదయ్యింది. అసోసియేషన్ 2023 స్టాటిస్టికల్ అప్‌డేట్ నివేదిక ప్రకారం.. 2003 నుంచి ఏ సంవత్సరంలోని ఇంతగా మరణాల సంఖ్య లేదని నిపుణులు అంటున్నారు.. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత 2020లో హృదయ సంబంధిత కారణాల వల్ల ఎక్కువ మంది మరణించారు..
మరణాలు అత్యధికంగా ఆసియా, నల్లజాతి, హిస్పానిక్ ప్రజల్లోనే ఎక్కువగా సంబంవించాయట.. చాలా ఏళ్ల తర్వాత హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణించిన వారి శాతం 4.6 పెరిగిందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తం చేశారు.. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి దాదాపు అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకముందే ఇలా జరిగి ఉంటుందని సమాచారం.. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అన్ని కారణాల వల్ల ప్రాణనష్టం విపరీతంగా పెరిగింది.
గుండె జబ్బులు, స్ట్రోక్ లక్షణాలు కలిగిన చాలా మంది దీని బారిన పడి ఇబ్బంది పడినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఆ వైరస్ దాడిని తట్టుకోలేక చాలా మంది తమ జీవితాలను కోల్పోయినట్లు కనిపించిందని అంటున్నారు. కార్డియోవాస్కులర్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా టాప్ కిల్లర్‌గా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వయసుతో సంబంధం లేకుండా సీవీడీ బారిన పడుతున్నారు.

కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే ఏంటి?

గుండె, రక్తనాళాలకి సంబంధించిన వ్యాధులని కార్డియో వాస్కులర్ డిసీజ్ అంటారు. గుండెపోటు, గుండె వైఫల్యం, హార్ట్ వాల్వ్ సమస్యలు అన్నీ దీని కిందకి వస్తాయి. జీవనశైలిలో మార్పులు, ధూమపానం, ఆల్కాహాల్, అధిక కొవ్వు, శారీరక వ్యాయామాలు లేకపోవడం, అధిక బరువు లేదా ఊబకాయం వల్ల ఇది సంభవించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version