నల్లగొండ జాతరలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. మహా శివరాత్రి వచ్చిన తరుణంలో నల్లగొండ జాతరలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లిలో రాత్రంతా హోరెత్తిన రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించారు. అశ్లీల, అసభ్య నృత్యా ల తో హోరెత్తిన చింతపల్లి గ్రామ జాతర కొనసాగింది.
30 మంది డాన్సర్లతో రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు రికార్డింగ్ డాన్సులు నిర్వహించారట. మహా శివరాత్రి సందర్భంగా రికార్డింగ్ డాన్స్ లను నిర్వహించారు గ్రామ కమిటీ సభ్యులు. పోలీసుల సమక్షంలోనే రికార్డింగ్ డాన్సులు నిర్వహించారని అంటున్నారు. కానీ దీనిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని సమాచారం అందుతోంది. కాగా నల్లగొండ జాతరలో అశ్లీల నృత్యాలు కలకలం రేపడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.