మీ భాగస్వామి చూపించేది ప్రేమా.. కామమా అన్నది తెలుసుకోవడానికి పనికొచ్చే సంకేతాలు..

-

మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారన్న భ్రమలో బ్రతకడం కంటే ఘోరం ఇంకొటి లేదు. అవతలి వారు మీతో ఎలా ఉన్నారనేది స్పష్టంగా తెలియకుండా అనవసరమైన ఊహాగానాలు ఊహించేస్తూ భ్రమల్లో బ్రతకవద్దు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమని నటిస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి అవసరం కోసం మాత్రమే ప్రేమిస్తున్నారు. అలాంటి వారిని కనిపెట్టడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

Couple in field at sunset

వేగంగా కదిలే ఆలోచనలు

నిజమైన తొందరగా పుట్టదు. దానికి సమయం కావాలి. కేవలం ఆకర్షణ మాత్రమే చాలా వేగంగా పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కనీస సమయం పడుతుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏర్పడడానికి కాస్త సమయం కావాలి. ఇలా కాకుండా ఇవాళ చూసి, రేపు పొద్దున్న కల్లా ప్రేమ కలిగిందంటే అందులో ఏదో విపరీతం ఉందనే అర్థం చేసుకోవాలి.

రిప్లై ఇవ్వనపుడు

నీకు కావాల్సినపుడు సమాధానం ఇవ్వకుండా ఉండే భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉండాలి. అత్యవసర సమయంలో ఫర్వాలేదు కానీ, సాధారణ సమయంలోనూ మీకు అందుబాటులో లేనట్లయితే అది ప్రేమ కాదని గుర్తుంచుకోండి.

మీ వైపు నుండే మొదలు కావడం

ఏ పనైనా మీ వైపు నుండే మొదలు కావడం అనేది మీ భాగస్వామ్య జీవితంలో ఎక్కువ గా జరిగితే అవతలి వారికి మీపై ఆసక్తి లేదని అర్థం. అయినా కలిసి ఉంటున్నారంటే అది శరీరం మీద ఇష్టంతోనే అయి ఉంటుంది. బెడ్ రూమ్ దాటి మిగతా విషయాల్లో వారి ఆలోచనలు సాగవు. అందుకే మీతో కలిసి తిరిగే ట్రిప్పుల విషయంలో వారికి పెద్దగా ఆసక్తి ఉండదు.

మోసపూరిత దృక్పథం

ఇలాంటి వాళ్ళు వారి ఆలోచనలకి తగినట్లుగా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. వారి సంతోషం కోసం మీరు కంట్రోల్ అవుతారు. కానీ వారికి మాత్రం మీ సంతోషం గురించి పెద్దగా పట్టదు.

గొడవలు

ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. చిన్న విషయానికే పెద్దగా అరుస్తారు. కొన్ని కొన్ని సార్లు మీతో మాట్లాడరు. చాలాసార్లు సరైన విషయంలో చర్చ జరుగుతుంటే పక్కకి వెళ్ళిపోతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version