మీ పార్ట్​నర్​కి మీపై ప్రేమ తగ్గిందనడానికి ఇవే సంకేతాలు..

-

ప్రతి రిలేషన్​షిప్ కొత్తలో చాలా బాగుంటుంది. ఈ లోకమే సరికొత్తగా కనిపిస్తుంది. కలిసి తినడం, కలిసి రెస్టారెంట్లకు, సినిమాలకు, పార్కులకు వెళ్లడం. రోజంతా తమ ప్రేమికుడు/ప్రేయసితో గడిపినా వాళ్లని వదిలి క్షణం నుంచే మళ్లీ వాళ్లని మిస్ అవుతున్న ఫీలింగ్. ఇదంతా ప్రతి బంధం మొదలైన కొత్తలో ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్ది రిలేషన్​షిప్​లో మార్పులు వస్తుంటాయి. ఒకవేళ మీ రిలేషన్​లో మీరు మాత్రమే అవతలి వ్యక్తికి ప్రాధాన్యతనిస్తూ వాళ్లు మాత్రం మిమ్మల్ని చులకనగా చేస్తే అలాంటి బంధం ఎక్కువ కాలం నిలవదని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీ భాగస్వామి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవడం చెడ్డ విషయం కాదు. మీరు వారి కోసం ఇష్టంగా ఏం చేసినా వాళ్లు గుర్తించకపోతే మీ రిలేషన్ షిప్​కి బ్రేకప్ చెప్పే టైం వచ్చిందని అర్థం. అయితే మీ పార్ట్​నర్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని తెలిపే కొన్ని సంకేతాలు మీ కోసం. మీ పార్ట్​నర్స్ ఇలా చేస్తే వాళ్లకి మీ మీద ఇష్టం పోయినట్లేనని అర్థం చేసుకుని ముందే జాగ్రత్త పడండి. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటంటే..?

మీరు మాత్రమే ట్రై చేయడం.. మీ లవర్​ని కలవాలని మీరు మాత్రమే ఆశపడటం. వారితో మాట్లాడలని తరచూ మీరే ఫోన్ చేయడం. వారితో టైం స్పెండ్ చేయడానికి మీరు మాత్రమే ఇంట్రెస్ట్ చూపించడం. ఇలా ప్రతీది మీరే చేయడం. అవతలి వాళ్లు అసలు మీతో గడపడానికి, మీ గురించి ఆలోచించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం వంటివి చేస్తుంటే వాళ్లకి మీ మీద ఇష్టం పోయిందని అర్థం.

మీ ఎఫెర్ట్​ని గుర్తించకపోవడం.. మీ బిజీ షెడ్యూల్​లో కూడా మీ పార్ట్​నర్​తో గడపడానికి టైం కేటాయించడానికి మీరు నిద్రను వాయిదా వేశారనుకోండి. మీ లవర్​ని కలవడానికి మీరే దూరం నుంచి వాళ్ల వద్దకు వెళ్లారనుకోండి. మీ లవర్​కి ఇష్టమైన డిషెస్​ని గంటల తరబడి కిచెన్​లో ఉండి కష్టపడి వారి కోసం ఇష్టంగా చేసినా.. తినేసి కనీసం చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వకపోవడం. ఇలా ప్రతీది మీరు మాత్రమే త్యాగం చేసి వాళ్ల నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోతే అది రిలేషన్​కి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మీ రిలేషన్​ షిప్ స్ట్రాంగ్​గా ఉండటానికి మీరు మాత్రమే ప్రయత్నిస్తే సరిపోదని చెబుతున్నారు. ఇలాంటి వారు మిమ్మల్ని, మీ ఎఫెర్ట్​ని గౌరవించరని తెలిపారు.

శారీరక సంబంధం కోసమేనా మీ బంధం.. కొందరు తమ భాగస్వాముల నుంచి కేవలం శారీరక సుఖం మాత్రమే కోరుకుంటారు. వారి కోసం టైం కేటాయించడం, వారితో కలిసి గడపడం, వారిని బయటకు తీసుకెళ్లడం, వారి లైఫ్​లో ఇంపార్టెంట్ డేస్​ని సెలబ్రేట్ చేసుకోవడం, వారు బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం, వారి సంతోషాన్ని రెట్టింపు చేయడం ఇలా ఏం చేయకుండా కేవలం శారీరకంగా మాత్రమే కలిసి ఉన్నట్లైదే వారు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని అర్థం. వారికి మీ మీద ప్రేమ లేదని అర్థమని.. ఇలాంటి రిలేషన్ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని సూచిస్తున్నారు.

మీ పార్ట్​నర్​ కోసం మీ సంతోషాన్ని కోల్పోతున్నారా? మీ సంతోషం గురించి వాళ్లు ఏ మాత్రం ఆలోచించడం లేదా..? అలాంటప్పుడు అభద్రతా భావంతో ఆ రిలేషన్​లో ఉండకూడదని సూచిస్తున్నారు. మీకు విలువ ఇవ్వని చోట, మీ గురించి పట్టించుకోని వాళ్లతో, మీరంటే ప్రేమ లేని వారితో ఉండటం కంటే సింగిల్​గా ఉండటమే బెటర్ అంటున్నారు.

నచ్చని వాళ్లతో మీరు మీలా ఉండగలిగినప్పుడే మీరు ప్రేమలో ఉన్నట్లు. మీ పార్ట్​నర్​ కోసం మీరు మారినా.. వారి కోసం మీరు మాత్రమే సర్దుకుపోయినా.. ప్రతి విషయంలో మీరే కాంప్రమైజ్ అయినా.. గొడవ పడిన ప్రతిసారి తప్పు మీది లేకపోయినా మీరే సారీ చెప్పినా.. ఇలాంటి బంధం నిలవదు. మీకు విలువ ఇవ్వకపోయినా.. మిమ్మల్ని కేర్ చేయకపోయినా మీకు వాళ్లతోనే ఉండాలనిపిస్తే ముందుగా మీరు వాళ్లని మార్చేందుకు ప్రయత్నించండి. లేకపోతే ఆ రిలేషన్​ నుంచి బయటపడండి. ఎందుకంటే ఏదో సినిమాలో చెప్పినట్టు.. ఇష్టం లేకపోయినా కలిసుండటానికి తను వస్తువు కాదు మనిషి.. ఇవాళ కాకపోతే రేపయినా తెలుస్తుంది. అని అలా ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బతకడం కష్టం. అందుకే మీరంటే ఇష్టం లేని వారితో మీ లైఫ్ గడపాలా వద్దా మీరే నిర్ణయించుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version