ఒక్కోసారి పరిస్థితులు బాగోక కొంతమంది విడిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకుందాం అని అనుకుని విడిపోయిన లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మాజీ లవర్ కి ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయేమో అని డౌట్ గా ఉందా..? మీ మాజీ లవర్ కి ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయని ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది విడిపోయాక కూడా మళ్లీ మళ్లీ ఫోన్ చేయడం లేదంటే మెసేజ్ పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నట్లయితే కచ్చితంగా వాళ్లు ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవాలి.
అలాగే ఓసారి బ్రేకప్ అయిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మానేస్తారు. అలా కాకుండా ఇంకా మిమ్మల్ని ఫాలో అవుతున్నట్లయితే కచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవాలి. విడిపోయాక కూడా మీతో పాటు ఉంటున్నా లేకపోతే నీ వెనకే వస్తున్నా మిమ్మల్ని ఫాలో అవుతున్నా ప్రతి విషయంలో మిమ్మల్ని గమనిస్తున్నా కచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి.
విడిపోయాక కూడా వేరే వాళ్ళతో మీరు ఉంటుంటే అసూయ పడుతుంటున్నారంటే కచ్చితంగా వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు మీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా లేదంటే ప్రతి విషయంలో మీకు హెల్ప్ చేస్తున్న కూడా ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవాలి. మీరు విడిపోయాక ఇంకా అందులోనే కూరికిపోయి బాధపడుతున్నా మూవ్ ఆన్ అవ్వకపోయినా వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని ఇంకో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని అర్థం చేసుకోవాలి.