సోషల్ మీడియాలో ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తుంటే దాన్ని నిజం అనుకునే నమ్ముతూ ఉంటారు జనం. దానికి తోడు పక్కన వాళ్లకు చూపించి ఇది నిజం నమ్మరా బాబూ అంటూ మాట్లాడుతూ ఉంటారు. తాజాగా జాతిపిత మహాత్మా గాంధీ పక్కన ఒక బాలుడు నిలబడి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతోంది.
చిన్నతనంలో టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అంటూ పలువురు పోస్ట్ చేసారు. ఫేస్బుక్ యూజర్ “సియో చీచూంగ్” ఫోటోను “దలైలామా గ్రూప్” అనే గ్రూపులో పోస్ట్ చేసి, “మహాత్మా గాంధీ మరియు లిటిల్ బాయ్ వన్ అండ్ ఓన్లీ టిబెటన్ దలైలామా” అని క్యాప్షన్ పెట్టారు. అసలు ఇది నిజమా కాదా అని జాతీయ మీడియా అన్వేషణ చేసింది. ఈ ఫోటో ని మార్ఫింగ్ చేసారని గుర్తించింది.
పిల్లవాడు నిజానికి దలైలామా అయినప్పటికీ, అతని చిన్నప్పటి ఫోటోని మహాత్మా గాంధీ ఫోటోలో సూపర్మోస్ చేయడం ద్వారా ఈ ఫోటోని తయారు చేసారు. చాలా మంది ఫేస్బుక్ యూజర్లు ఫోటోషాప్ చేసిన ఇమేజ్ నిజమని నమ్ముతూ షేర్ చేశారు. ఈ ఫోటో గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. భారత రాజ్యాంగ సంస్కరణలపై ఒక సమావేశంలో పాల్గొనడానికి లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్ సందర్శించినప్పుడు 1931 నవంబర్ 3 న ఈ చిత్రాన్ని తీశారు.
ఆ సమయంలో, దలైలామా కూడా పుట్టలేదు. ఈ ఫోటో “దలైలామా” (https://www.dalailama.com/the-dalai-lama/biography-and-daily-life/birth-to-exile) వెబ్సైట్లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ ప్రకారం, తూర్పు టిబెట్‌లోని అమ్డోలోని కుంబుమ్ మొనాస్టరీలో ఈ ఫోటో తీసారు. అప్పుడు దలైలామాకు నాలుగేళ్ల వయసు మాత్రమే. దలైలామా జూలై 6, 1935 న జన్మించారు. అయితే తన జీవితంలో తానెప్పుడు గాంధీజీని కలవలేదని కాని ఆయన తనకు కలలో కనిపించారని దలైలామా చెప్పారు.