ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంపై అనుమానిత డ్రోన్ ఎగరడం కలకలం గా మారింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు.. మంగళగిరిలోని పవన్ కల్యాణ్
క్యాంపు ఆఫీస్ పై డ్రోన్ ఎగురవేశారు. దీంతో అప్రమత్తం అయిన జనసేన నేతలు.. వెంటనే డీజీపీతో పాటు, గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిషేదిత ప్రాంతంలో అనుమానంగా డ్రోన్ ఎగురవేసిన ఘటనపై దర్యాప్తు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు తమ ఫిర్యాదులో కోరారు.. మరి ఇంతకు పవన్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎందుకు ఎగరవేశారు. ఎవరైన గస్తీ కాస్తున్నారా..? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దాడికి కుట్ర పన్నుతున్నారేమో అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.