రైతుల మోటార్లకు సోలార్ పంపు సెట్లు.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

-

చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి కలిగేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. TGNPDCL సంస్థలో ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. నిరుద్యోగుల కల ప్రత్యేక రాష్ట్రంలో నెరవేరలేదు. మేము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ మొదలు పెట్టామని.. నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నానని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే నిరుద్యోగుల కల నెరవేరుతుందని చెప్పాం.. చెప్పినట్టుగానే తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 56వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు.

విద్యుత్ శాఖ ప్రభుత్వానికి అత్యంత కీలకం అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్ లో మన విద్యుత్ డిమాండ్ 22,400 మెగావాట్లకు పెరుగనుందని వివరించారు. ఫ్యూచర్ సిటీలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ శాఖకు ప్రతీ నెల రూ.148 కోట్లు చెల్లిస్తున్నామని.. రైతుల మోటార్లకు సోలార్ పంపుసెట్లు అందించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version