పావురాల కోసం ప్రత్యేకంగా రెండతస్తుల భవనం.. 20 ఏళ్లగా పెంపకం..

-

పక్షుల కోసం..గూళ్లు, పంజరాలు కట్టడం చూశాం.. ఏకంగా రెండంతస్తుల భవనం మీరు ఎప్పుడైనా చూశారా..? పావురాల కోసమే ప్రత్యేకంగా అక్కడ అంత బిల్డింగ్ కేటాయించి వాటి యోగక్షేమాలు చూసుకుంటున్నారట. ఇమాజిన్.. ఆ బిల్డింగ్‌ అంత పావురాలే ఉంటే ఎలా ఉంటుందో. వాటి శబ్ధాలకు తోడు..పాటలు కూడా ఫ్యాన్‌ కింద హ్యాపీగా సేదతీరుతున్నాయి.. ఇది ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం సమీపంలోనే..!!
గన్నవరం సమీపంలోని మానికొండ గ్రామంలో ఉన్న రెండు అంతస్తుల భవనంలో కుటుంబాలు ఉండటం లేదు.. మనుషులు అసలు కనిపించరు. కేవలం పావురాలు మాత్రమే ఉంటాయి. సాధారణంగా రెండు అంతస్తుల భవనం అంటే కనీసం నాలుగు కుటుంబాలు నివాసం ఉండొచ్చు..కానీ ఈ భవనంలో మాత్రం పూర్తిగా పావురాలే ఉంటాయి. గత పది సంవత్సరాలకు పైగా ఈ భవనంలో పక్కాగా పావురాలను మాత్రమే పెంచుతున్నారు చెరుకువాడ శ్రీనివాసరావు అనే బిల్డర్.

సపర్యల్లో లోటే లేదు..

ఈ భవనంలో ఉంటున్న పావురాలకు మనుషులతో సమానంగా జీవనం సాగిస్తున్నాయి. ఉదయం లేచింది మెదలు రాత్రి పడుకునే వరకు పూర్తిగా స్వచ్ఛమైన గాలిని, నీరు, ఆహరం అందిస్తారు.. వేకువజామునే పావురాలు లేచింది మెదలు, వాటికి జొన్నలు, పెసలు, శనగలు, గోధుమలు, బఠాణీలు వంటి 15 రకాల ఆహరాన్ని అందిస్తారు. అంతే కాదు ప్రత్యేకంగా తాగునీటి సరఫరా ఉంటుంది. అది పూర్తిగా మెడికేటెడ్ వాటర్ కావటం ఇంకా హైలెట్. పావురాల కోసం ప్రత్యేకించి మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేశారు. తెలుగు పాటలతో పాటుగా హిందీ, ఇంగ్లీష్ పాటలను పావురాల కోసం ప్లే చేస్తారు. మ్యూజిక్ ను వింటూ మేత తింటూ, పావురాలు విలాసవంతమయిన జీవనం గడిపేస్తున్నాయి.. పక్షులు ఉండే ప్రాంతం అంటే పారిశుద్ధ్యానికి ఇబ్బందిగా ఉంటుంది, కాని ఇక్కడ మనుషులు ఉంటే ఎలాంటి హైజెనిక్ వాతావరణం ఏర్పరచుకుంటామో, అలాంటి వాతావరణమే ఉండటం విశేషం.
ఉదయం, సాయంత్రం పావురాలు ఉంటే ఫ్లోరింగ్‌ను పూర్తిగా శానిటైజ్ చేస్తుంటారు. సాధారణంగా భవనంలో పావురాలను పెంచాలంటే ఆషామాషీ కాదు. వాటిని కాపాడుకోవటం ప్రదాన సమస్య. అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలి. సమయానికి ఆహరం, తాగునీరు, ఎంత ముఖ్యమో, అనారోగ్యం గురయినప్పుడు గుర్తించి మందులు వేయటం అంతే ముఖ్యం. ఇందుకు ప్రత్యేకంగా ఒక మనిషిని శ్రీనివాసరావు నియమించారు. అతనే స్వయంగా పావురాలతో మమేకమైన.. వాటి ఆలనా పాలనా చూసుకుంటాడు.. తాను చూసుకుంటున్న పావురాలు ఏ జాతికి చెందినవి, ఎలా ఉంటాయి, వాటిని కాపాడుకునే విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను గురించి రాము గుక్క తిప్పుకోకుండా చెప్తేస్తాడంటే.. అతనికి వాటిపై ఎంత శ్రద్ధ ఉందో మీరు ఆలోచించండి. 150కి పైగా పావురాలను తమ వద్ద పెంచుతున్నామని అంటున్నాడు.
దాదాపుగా 20 ఏళ్ళుగా పావురాలను పెంచుకుంటున్నామని, వాటి పై ఉన్న ప్రేమతోనే ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించినట్లు చెరుకువాడ శ్రీనివాసరావు తెలిపారు. పావురాలకు గాలి, వెలుతురు కోసం భవనాన్ని డిజైన్ చేయించి నిర్మించారట.. దోమల నుంచి రక్షణ కోసం ప్రత్యేకంగా మెష్‌ను ఏర్పాటు చేశామని, దశాబ్దాలుగా ఆలనాపాలనా చూస్తున్నామని తెలిపారు. ఆదాయం లేకపోయినా తమకు వచ్చిన ఇబ్బంది లేదని శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఎగిరే పక్షులను అలా ఎగరకుండా బంధీగా చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటారు.. ఇదే ప్రశ్న శ్రీనివాసును చాలామంది అడిగారట..దానికి అతనిచ్చిన సమాధానం ఏంటో తెలుసా.. వీటిని బయటకు వదిలితే, పక్షులు, కాకులు పొడుచుకొని తినేస్తాయి కనుక వాటికి రక్షణగా ఉంటున్నామని తెలిపాడు.. మీరు దీనికి ఏకీభవిస్తారా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version