విచిత్రం: క్రికెటర్ తలలో నుంచి పొగలు,వైరల్ అవుతున్న వీడియో

-

క్రికెట్ ఆట పేరు వినగానే చిన్నా,పెద్దా అన్న తేడా లేకుండా అందరూ టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. ఎందుకంటే క్రికెట్ చూడగానే ప్రపంచాన్నే మర్చిపోతూ ఉంటారు. ఈ మ్యాచ్ లు ఒక్కోసారి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేస్తూ తెగ థ్రిల్లింగ్ సృష్టిస్తారు. మ్యాచ్ చూస్తున్నంత సేపు అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సెమీస్,ఫైనల్స్ చూసారంటే మాత్రం శరీరంలో హీట్ పుట్టక మానదు. అయితే అభిమానులలో హీట్ పుట్టే సంగతి పక్కన పెడితే ఆటగాళ్ల బుర్రలు ఎంతగా హీట్ ఎక్కుతాయో అన్న విషయం ఈ వైరల్ వీడియో ద్వారా అర్ధం అవుతుంది. ఇంతకీ ఏమి జరిగింది అంటే… పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ఆసీస్ ప్లేయర్ క్రిస్ లిన్ తలలో నుంచి పొగ వచ్చిన వీడియో ఒకటి ట్విట్టర్ లో హల్ చల్ చేస్తుంది. అయితే అది చూస్తే మాత్రం ఎవరైనా గ్రాఫిక్స్ అని అనుకుంటారేమో. అదేమీ లేదు లీగ్ మ్యాచ్ లో భాగంగా క్రిస్ లిన్ భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. వర్షం కారణంగా 12ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో క్రిస్ లిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న లాహోర్ కలందర్స్ జట్టు ముందు భారీ లక్ష్యం ఉంది.

అయితే భారీ లక్ష్యం ని ఛేదించే క్రమంలో 15 బంతుల్లో 30 పరుగులు చేసిన లిన్ మరో భారీ షాట్ ఆడబోతూ అవుటయ్యాడు. అయితే ఒక్కసారిగా ఔటవ్వడం తో మైదానాన్ని వీడుతూ లిన్ తన తలకు ఉన్న హెల్మెట్ ను తీసి పెవిలియన్ కు చేరుతున్న సమయంలో విచిత్రంగా అతడి తలపై నుంచి పొగలు కక్కుతున్నట్లు కనిపించింది. అయితే ఆ సమయంలో అది కాస్త వీడియో లో రికార్డ్ అవ్వడం తో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చావోరేవో అన్నట్లు ఆడే ఆటగాళ్ల టెన్షన్ ఇలానే ఉంటుందంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version