Sumangal Rural Postal Life Insurance Scheme: రూ. 95 సేవ్‌ చేస్తే.. రూ. 13 లక్షల పైనే రిటర్న్స్‌..

-

వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత పక్కన పెట్టాలని అందరూ అనుకుంటారు. కానీ ఆ టైంకు పెరిగే ఖర్చుల వల్ల ఎటు నుంచి డబ్బు వెళ్లిపోతుందో కూడా తెలియకుండా అయిపోతాయి. శాలరీ పడిన ప్రతిసారి..ఈ నెల కొంతైనా సేవ్‌ చేయాలనుకుంటాం..కానీ నెలాఖరుకు రూపాయి కూడా మిగలకుండా అయిపోతుంది. డబ్బు సేవ్‌ చేయాలంటే..వేలకు వేలు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఎంత మిగిలినా అది సేవింగ్‌లోకి వేస్తే..రేపు అదే వంద అవుతుంది..వేలు అవుతాయి. కానీ చాలామంది రౌండ్‌ ఫిగర్‌ అమోంట్ ఉంటేనే అది సేవ్‌ చేయాలనుకుంటారు. రూ. 95తో కూడా సేవ్‌ చేస్తే.. రూ. 13లక్షలు పైనే రిటర్న్స్‌ వచ్చే స్కీమ్‌ ఉంది తెలుసా..?
ఇండియా పోస్ట్ అనేక పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌ని అందిస్తోంది. అలాంటి పథకాల్లో సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో రోజూ రూ.95 చొప్పున పొదుపు చేస్తే రూ.13 లక్షల పైనే రిటర్న్స్ వస్తాయి. మీకు దగ్గర్లో ఉన్న ఏ పోస్ట్ ఆఫీసులో అయినా సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో చేరొచ్చు. 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రూ.10 లక్షల సమ్ ఇinsurancన్స్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి పాలసీ డబ్బులతో పాటు బోనస్ డబ్బులు కూడా అందుతాయి..
ఈ పాలసీలో 15 ఏళ్లు, 20 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇది మనీ బ్యాక్ పాలసీ కాబట్టి పాలసీ మధ్యలోనే డబ్బులు వస్తాయి. పాలసీ హోల్డర్ 15 ఏళ్ల పాలసీ తీసుకుంటే 6 ఏళ్లు, 9 ఏళ్లు, 12 ఏళ్లు పూర్తైన తర్వాత, 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్లు, 20 ఏళ్లు పూర్తైన తర్వాత కొంత మనీబ్యాక్ వస్తుంది. మిగతా 40 శాతం మెచ్యూరిటీ సమయంలో బోనస్‌తో కలిపి పొందవచ్చు.

సింపుల్‌గా చెప్పాలంటే..

25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 20 ఏళ్ల పాలసీ గడువుతో రూ.7 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకున్నారనుకోండి..రోజుకు రూ.95 చొప్పున ప్రీమియం చెల్లించాలి. అంటే నెలకు రూ.2,850, ఆరు నెలలకు రూ.17,100 ప్రీమియం చెల్లించాలి. పైన చెప్పినట్టుగా 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్లు, 20 ఏళ్లు పూర్తైన తర్వాత మనీబ్యాక్ వస్తుంది. ఈ మనీబ్యాక్ కాకుండా బోనస్‌తో కలిపి మెచ్యూరిటీ సమయంలో రూ.9.52 లక్షలు వస్తుంది. మనీబ్యాక్, మెచ్యూరిటీ సమయంలో వచ్చే డబ్బులు మొత్తం కలిపి రూ.13.72 లక్షలు లభిస్తుంది. తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూ, మెచ్యూరిటీ సమయంలోనే కాకుండా, మధ్యలో కూడా రిటర్న్స్ కోరుకునేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్‌లో సేవింగ్స్‌తో పాటు బీమా కూడా లభించడం విశేషం. ఇంకేందుకు ఆలస్యం..నెలకు మూడు వేల లోపే ఉంది.. కాస్త ఖర్చులు అడ్జెస్ట్‌ చేసుకుంటే చేరొచ్చు.. ఏమంటారు..?

Read more RELATED
Recommended to you

Exit mobile version