స్విగ్గీ వార్షిక నివేదిక.. ఆర్డర్స్‌లో బిర్యానీ ఫస్ట్.. టిప్‌ రూపంలో రూ.53 కోట్లు వసూల్‌..!!

-

ఇండియన్స్‌కు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే బిర్యానికి ఉన్న క్రేజ్‌ వేరు. ఎక్కడికి వెళ్లినా బిర్యానియో కావాలంటాం.. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకోవాలంటే.. మన ఆప్షన్‌ బిర్యానీయే అవుతుంది. అది అయితేనే టేస్టీగా కడుపునిండా తినొచ్చు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీలో ఒక సెకనుకు ఎన్ని బిర్యానీ ఆర్డర్స్‌ వస్తున్నాయో తెలుసా..?
హోటల్స్‌లో మాత్రమే కాదు.. ఆన్ లైన్ ఆర్డర్లలోనూ.. బిర్యానీ దూసుకెళ్తోంది. తమకు వచ్చే ఫుడ్ ఆర్డర్లలో చికెన్ బిర్యానీయే నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. 2022 సంవత్సరానికి ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లపై ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఓ సర్వే నిర్వహించింది. ఈ మేరకు వార్షిక ట్రెండ్‌ నివేదికకు సంబంధించి 7వ ఎడిషన్‌ను విడుదల చేసింది. స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్‌ చేసిన వంటకాల్లో చికెన్‌ బిర్యానీ టాప్‌లో ఉందట.. దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయి. నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారట.
చికెన్‌ బిర్యానీ తర్వాత వరుసగా మసాలా దోశ రెండో స్థానంలో నిలిచిందని స్విగ్గీ నివేదిక చెప్తోంది.. చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌, పన్నీర్‌ బటర్‌ మసాలా, బటర్‌ నాన్‌, వెజ్‌ఫ్రైడ్‌ రైస్‌, వెజ్‌ బిర్యానీ, తందూరి చికెన్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. విదేశీ వంటకాల్లో ఇటాలియన్‌ పాస్తాకి డిమాండ్ ఎక్కువగా ఉందట.. ఆ తర్వాతి స్థానాల్లో పిజా, మెక్సికన్‌ బౌల్‌, స్పైసీ రొమెన్‌ను భారతీయులు అత్యధికంగా ఆర్డర్‌ చేశారు.

స్నాక్స్‌లో సమోసా ఫస్ట్..

కేటగిరీలో సమోసా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. 2022లో సమోసాల కోసం స్విగ్గీకి 40 లక్షల ఆర్డర్లు వచ్చాయట… తర్వాతి స్థానాల్లో, పాప్‌కార్న్‌, పావ్‌ బాజీ, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, గార్లిక్‌ బ్రెడ్‌ స్టిక్స్‌ నిలిచాయి.

స్వీట్స్‌లో

స్వీట్స్‌లో గులాబ్ జామూన్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అత్యధికంగా ఆర్డర్‌ చేసిన డిసర్ట్స్‌లో గులాబ్‌ జామూన్‌, రస్‌మలాయి, చాకోలావా కేక్‌, రసగుల్లా, చాకోచిప్స్‌ ఐస్‌క్రీమ్‌ వరుసగా టాప్‌-5లో నిలిచినట్లు స్విగ్గీ తెలిపింది.
ఈ సంవత్సరం కస్టమర్లు తమ డెలివరీ ఏజెంట్లకు రూ.53 కోట్ల రూపాయలను టిప్ రూపంలో ఇచ్చారని స్విగ్గీ వెల్లడించింది. మొత్తం 35 లక్షల మంది కస్టమర్లు టిప్ ఇచ్చారని పేర్కొంది. అమ్మో ఇంత పెద్ద అమౌంటా.. ? ఇంతకీ మీరు ఎంత ఇచ్చారు ఈ సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి రివైజ్‌ చేసుకోండి.. ఒక నెల శాలరి ఉండే ఉంటుందేమో..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version