ఏ సినిమా అయినా విడుదలవడమే ఆలస్యం.. తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ లో అప్ లోడ్ అవ్వాల్సిందే.. అలా ఎలా?

-

ఎన్ని పైరసీ సాఫ్ట్ వేర్లు వచ్చినా… తమిళ్ రాకర్స్ ది ప్రత్యేక స్థానం. 10 ఏళ్ల ప్రస్థానం దానిది. చెన్నైలోని నుంగమ్ బక్కమ్ అనే ప్రాంతంలో ఓ షెడ్ లో తమిళ్ రాకర్స్ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పుడు దాని పేరు మూవీస్ ఫ్రీ టూ. తర్వాత అందరికీ ఈజీగా గుర్తుండటం కోసం దానికి తమిళ్ రాకర్స్ అనే పేరు మార్చారు.

అది ఏ సినిమా అయినా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, హాలీవుడ్.. ఇలా ఏ ఉడ్ లతో సంబంధం లేకుండా.. సినిమా విడుదలయిన క్షణాల్లోనే సినిమా పైరసీ కాపీ తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ లో ప్రత్యక్షమవుతుంది. పైరసీని అరికట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ ను మాత్రం ఏం చేయలేకపోతున్నారు. వెబ్ సైట్ నిర్వాహకులు చాలెంజ్ చేసి మరీ సినిమా పైరసీని తమ సైట్ లో పెడుతున్నారు. ఇటీవల రోబో 2.0 సినిమాను కూడా ఇలాగే విడుదలయిన క్షణాల్లోనే పైరసీ చేసి తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ లో పెట్టారు. ఒక్క 2.0 నే కాదు.. ఏ సినిమా విడుదలయినా.. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా.. అది విడుదల అవడం ఆలస్యం.. ఆ వెబ్ సైట్ లో ప్రత్యక్షమవుతుంది. చివరకు మొన్న రిలీజ్ అయిన మహేశ్ బాబు మహర్షి సినిమా కూడా విడుదలయిన రోజే గంటలోనే పైరసీ వచ్చేసింది.

భారత్ లో టొరెంట్ సైట్లు చాలా ఉన్నాయి. ఆ సైట్లలో ప్రతి ఆరు గంటలకు దాదాపు 6780 సినిమాలు అప్ లోడ్ అవుతాయట. చాలామంది నెటిజన్లు… మోనోనోవా, దపైరేట్ బే, కిక్క్ యాస్ టొరెంట్స్, ఐఎస్వో హంట్ అనే టొరెంట్ సైట్లను ఉపయోగించినప్పటికీ… ఆ సైట్ల నుంచి వీడియోలు డౌన్ లోడ్ చేయడంలో భారత్.. యూఎస్ కంటే వెనుకబడే ఉందట. అయితే.. ఎక్కువ ఇండియన్స్ టొరెంట్ జెడ్ అనే పైరసీ సాఫ్ట్ వేర్ ను సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవడానికి వాడుతారు.

సరే.. ఎన్ని పైరసీ సాఫ్ట్ వేర్లు వచ్చినా… తమిళ్ రాకర్స్ ది ప్రత్యేక స్థానం. 10 ఏళ్ల ప్రస్థానం దానిది. చెన్నైలోని నుంగమ్ బక్కమ్ అనే ప్రాంతంలో ఓ షెడ్ లో తమిళ్ రాకర్స్ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పుడు దాని పేరు మూవీస్ ఫ్రీ టూ. తర్వాత అందరికీ ఈజీగా గుర్తుండటం కోసం దానికి తమిళ్ రాకర్స్ అనే పేరు మార్చారు. ఈ వెబ్ సైట్ సృష్టికర్త భాస్కర్ కుమార్ అనే వ్యక్తి.

అసలు వీళ్లకు సినిమా రిలీజ్ కంటే ముందు లేదా సినిమా రిలీజ్ కాగానే ప్రింట్ ఎలా దొరుకుతుంది..

ఈ విషయం తెలుసుకోవాలంటే.. మనం తమిళ్ రాకర్స్ సృష్టికర్త భాస్కర్ కుమార్ మాటల్లోనే చదువుదాం..

సినిమా పైరసీ పొందడానికి చాలా దారులు ఉన్నాయి. మేము ఒక్కోసారి ఒక్కో దారిని ఎంచుకుంటాం. ఎందుకంటే.. సినిమాల్లోనూ లో బడ్జెట్ సినిమాలు ఉంటాయి.. హై బడ్జెట్ సినిమాలు ఉంటాయి. అయితే.. ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ ముఖ్యం. ఆయన పెట్టిన పెట్టుబడికి అంతో ఇంతో లాభం రావాలనే చూస్తాడు.. తప్పితే ఆ సినిమా పైరసీ అయిందా? ఇంకేదో అయిందన్నా పట్టించుకోడు. లాభాలు వస్తున్నాయా? లేదా? అదే వాళ్లకు ముఖ్యం.

సినిమా రిలీజ్ కు ముందు రోజు కానీ.. ఆ రోజు ఉదయం కానీ.. మీడియాకు ప్రివ్యూ వేస్తారు. ప్రివ్యూ వేసిన ఫిలిం స్టూడియోతో తమిళ్ రాకర్స్ కు సంబంధాలు ఉంటాయి. వాళ్లకు ఓ లక్ష రూపాయల దాకా పే చేసి ప్రివ్యూ ప్రింట్ తీసుకుంటాం. దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటాం. సినిమా రిలీజ్ అవగానే.. సైట్ లోకి అప్ లోడ్ చేస్తాం. అయితే.. ఇక్కడ మేం ఖర్చు పెట్టింది లక్ష. మాకు ఎక్కువ ప్రాఫిట్స్ కావాలనుకుంటే.. డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ తో డీలింగ్ పెట్టుకుంటాం. ప్రొడ్యూసర్ కు చిన్న క్లిప్ చూపిస్తాం. తర్వాత డబ్బు డిమాండ్ చేస్తాం. సినిమాను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయకుండా ఉండాలంటే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. పెద్ద బడ్జెట్ మూవీ అయితే… ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వడానికి వెనుకాడడు. అదో పెద్ద కష్టం కూడా కాదు. మాకు 2 లక్షలు మిగిలినట్టే కదా. ఒకవేళ అతడు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా మేమే తమిళ్ రాకర్స్ లో అప్ లోడ్ చేస్తాం. లేదంటే టొరెంట్ హోస్ట్ సైట్లకు ఆ ప్రింట్ ను అమ్మేస్తాం.

ఒకవేళ మాకు సినిమా ముందు ప్రివ్యూ దొరక్కపోతే.. అప్పుడు ఇంకో దారి ఉంది. అదే వరల్డ్ వైడ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ. ఇప్పుడు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. అదే మాకు ప్లస్ పాయింట్. ఓవర్సీస్ కు సినిమా ప్రింట్ ను వరల్డ్ వైడ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ ద్వారా పంపిస్తారు. అంటే.. సినిమాను రిలీజ్ కంటే ముందు సెక్యూర్డ్ సర్వర్ లోకి పంపిస్తారు. ఆ తర్వాత.. సెక్యూర్డ్ సర్వర్ నుంచి ఆ మూవీని యాక్సెస్ చేసుకోవడానికి మల్టిప్లెక్స్ వాళ్లకు క్రెడెన్షియల్స్ ఇస్తారు.

అప్పుడు మేము ఇన్వాల్వ్ అవుతాము. సెక్యూర్డ్ సర్వర్ నుంచి మూవీని యాక్సెస్ చేసుకునే మల్టిప్లెక్స్ తో మాకు టైఅప్ ఉంటుంది. సినిమా ప్రారంభం కావడానికి 10 నుంచి 15 నిమిషాల ముందు.. స్ట్రీమింగ్ లింక్స్ ను డబుల్ రూట్ చేయిస్తాం. దాని వల్ల ఒకే సినిమా… ఒకేసారి టైమ్ లో రెండు స్క్రీన్ల మీద ప్లే అవుతుంది. మల్టిప్లెక్స్ కు ఇచ్చిన పార్టిసిపేషన్ కీతో మేం కూడా లాగిన్ అయి థియేటర్ లో సినిమా ప్రారంభం కాగానే.. మా దగ్గర కూడా స్టార్ట్ అవుతుంది. కాకపోతే మేము కంప్యూటర్ స్క్రీన్ మీద సినిమా చూస్తాం. దాన్ని మేం డౌన్ లోడ్ చేసి వెంటనే వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తాం.

అది కూడా కుదరకపోతే.. మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్లకు 500 నుంచి 1500 దాకా డబ్బులు చెల్లిస్తాము. వాళ్లు థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తూ… రికార్డు చేసి మాకు పంపిస్తారు. అది థియేటర్ ప్రింట్ అయినా అప్ లోడ్ చేస్తాం. ఎందుకంటే.. అప్పుడే రిలీజ్ అయిన సినిమా థియేటర్ ప్రింట్ అయినా జనాలు ఎగబడి చూస్తారు… అంటూ తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ పైరసీ ప్రస్థానాన్ని తెలిపాడు భాస్కర్.

అయితే.. ఎన్నిసార్లు పైరసీ వెబ్ సైట్లను అధికారులు మూసేయిస్తున్నా వీళ్లు మాత్రం.. వెంట వెంటనే కొత్త కొత్త డొమేన్లతో కొత్త కొత్త లేఅవుట్లతో వేర్వేరు సర్వర్లతో సైట్ ను యాక్సెస్ చేస్తూనే ఉంటారట. రకరకాల ఐపీల నుంచి వీపీఎన్ ల ద్వారా సైట్లను యాక్సెస్ చేస్తూ.. అధికారులకే చుక్కలు చూపిస్తున్నారు తమిళ్ రాకర్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version