‘రూలర్’ పేరుతో సి.కల్యాణ్ బ్యానర్‌పై ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ టైటిల్ రిజస్టర్ చేయించారు. ఈ సినిమాకే ఆ టైటిల్ ని రిశీలిస్తున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ కి చెందిన ఒకరు తెలిపారు. మరి బాలకృష్ణ రూల్ చేసేంతటి కథ ఇందులో ఏముందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్.
‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండు భాగాలు బాలకృష్ణని పూర్తిగా డిజప్పాయింట్ చేశాయి. ఎన్నో ఆశతో చేసిన ఈ బయోపిక్‌లు బాక్సాఫీసు వద్ద పసలేనివిగా తేలిపోయాయి. ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య.
తనకు ‘జై సింహా’ చిత్రాన్ని అందించిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో బాలకృష్ణ రూలర్‌గా మారబోతున్నాడట. మరి ఎవరికి రూలర్? ఎక్కడ రూలర్? అనేది డౌట్ రావచ్చు. ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.
‘రూలర్’ పేరుతో సి.కల్యాణ్ బ్యానర్‌పై ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ టైటిల్ రిజస్టర్ చేయించారు. ఈ సినిమాకే ఆ టైటిల్ ని రిశీలిస్తున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ కి చెందిన ఒకరు తెలిపారు. మరి బాలకృష్ణ రూల్ చేసేంతటి కథ ఇందులో ఏముందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్. అయితే సినిమాలో బాలకృష్ణ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారట, ఆ పాత్రకి యాప్ట్‌గా ఉండాలని ఈ టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తంది. ‘లెజెండ్’ తర్వాత జగపతిబాబు ఇందులో బాలకృష్ణతో ఢీ కొట్టనున్నారు. విలన్ పాత్రకి ఆయన్ని ఎంపిక చేశారు.
మరో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించనున్నారట. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందటని తెలిసింది. ఇదిలా ఉంటే పవర్‌ఫుల్ టైటిల్స్‌లో నటించిన బాలకృష్ణ చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘చెన్నకేశవ రెడ్డి’, ‘లక్ష్మినరసింహా’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’ వంటి కొన్ని చిత్రాలని మినహాయిస్తే.. ‘డిక్టేటర్’, ‘లయన్’, ‘జై సింహా’,‘పరమ వీర చక్ర’, ‘మహారథి’, ‘వీరభద్ర’, ‘విజయేంద్ర వర్మ’, ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, ‘సీమ సింహాం’ ఇలా చాలా సినిమాలు ఆడియెన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యాయి. టైటిల్‌లో ఉన్న పవర్ సినిమా కంటెంట్ లో లేకపోవడంతో డిజాస్టర్స్‌గా నిలిచాయి.
మరి గతంలో మాదిరిగా కాకుండా ఈ సారైనా ‘రూలర్’ వంటి శక్తివంతమైన టైటిల్‌తోనేకాదు, ఆ స్థాయిలో కంటెంట్‌తో వస్తాడా? లేడా? అన్నది చూడాలి. ఆ తర్వాత బోయపాటితో బాలకృష్ణ ఓ మూవీ చేయనున్న విషయం విదితమే.