టాటా మోటార్స్ ఇయ‌ర్ ఎండింగ్ సేల్స్‌.. కార్ల‌పై రూ.65వేల వ‌ర‌కు ప్ర‌యోజ‌నాలు…

-

ప్ర‌ముఖ కార్ల త‌యారీదారు టాటా మోటార్స్ ఇయ‌ర్ ఎండింగ్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప‌లు కార్ మోడ‌ల్స్ పై రూ.65వేల వ‌ర‌కు ప్ర‌యోజ‌నాలను అందిస్తున్నారు. సంవ‌త్స‌రాంతం సంద‌ర్బంగా ఈ సేల్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు టాటా మోటార్స్ తెలిపింది. టాటాకు చెందిన టియాగో, హారియ‌ర్‌, నెక్సాన్ త‌దిత‌ర కార్ల‌పై గ‌రిష్టంగా రూ.65వేల వ‌ర‌కు బెనిఫిట్స్ ను క‌స్ట‌మ‌ర్లు పొంద‌వ‌చ్చు.

tata motors year ending sale offers benefits up to rs 65000

టాటా టియాగో బీఎస్‌6 కార్‌పై రూ.25వేల వ‌ర‌కు, టాటా హారియ‌ర్ బీఎస్6 కామో, డార్క్ ఎడిష‌న్, ఎక్స్‌జ‌డ్ ప్ల‌స్‌, ఎక్స్‌జ‌డ్ఎ ప్ల‌స్ మోడ‌ల్స్ పై రూ.65వేల వ‌ర‌కు, నెక్సాన్ డీజిల్‌పై రూ.15వేల వ‌ర‌కు, టాటా టిగార్ బీఎస్‌6పై రూ.30వేల వ‌ర‌కు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

టియాగో కార్‌లో 1.2 లీట‌ర్ల ఇంజిన్‌, 86పీఎస్ ప‌వ‌ర్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. హారియ‌ర్ మోడ‌ల్స్ లో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్‌, క్ర‌యోటెక్ 170 ట‌ర్బో చార్జ్‌డ్ బీఎస్‌6 డీజిల్ ఇంజిన్ ఫీచ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే నెక్సాన్ కారులో 6 స్పీడ్ ట్రాన్స్ మిష‌న్‌, ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్స్‌, 120పీఎస్ ప‌వ‌ర్ ఫీచ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news