పక్షులను తోలే జాబ్‌.. కోటీశ్వరుడైన ఉద్యోగి..!

-

కొన్ని ఉద్యోగాలు వాటి జీతాలు భలే గమ్మత్తుగా ఉంటాయి.. ఇది కూడా ఒక జాబ్‌ అన్నట్లు ఉంటుంది. శాలరీ మాత్రం లక్షల్లో ఉంటుంది. సాధారణంగా మన ఇళ్లలో ముసలి వాళ్లు ఇంటికి కుక్క వచ్చినా, ఏదైనా పక్షి వచ్చినా అస్సలు ఊరుకోరు.. వాటిని తోలిందాక వారికి నిద్రపట్టదు. వీళ్లకు పక్షులు తోలే జాబ్‌ ఇస్తే బాగా సరిపోతుందని మనం కూడా అనుకునే ఉంటాం.. నిజంగానే అలాంటి జాబ్‌ ఒకటి ఉంటే..పైగా దానికి శాలరీ చాలా ఎక్కువ. ఒక్క నెల చేస్తే చాలు లక్షల్లో సంపాదించవచ్చు. దీనికి చదువు, తెలివితేటలు ఏం అక్కర్లేదు.

అసలేమిటీ ఉద్యోగం..?

మీకు కేటాయించిన ఏరియాలో పిచ్చుకలు, పక్షులు రాకుండా చూసుకోవడమే మీరు చేసే పని. రోజంతా అక్కడే ఉండి పక్షలను వెళ్లగొడుతూ ఉండాలి. మీరు ఏం చేసినా ఫర్వాలేదు. కానీ ఒక్క పక్షి కూడా అక్కడ వాలకుండా చూడాలి. ఇలా రోజంతా గనుక కరెక్టుగా మీ బాధ్యతను నిర్వర్తిస్తే చాలు.. సాయంత్రానికి 20 వేల రూపాయలను తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇలా నెల రోజుల పాటు కష్టపడ్డారంటే చాలు.. లక్షల్లో సంపాదించుకోవచ్చు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన మిస్టర్ చిప్స్ చిప్పీ కంపెనీ ఈ వింత ఉద్యోగం కోసం వ్యక్తులను రిక్రూట్ చేస్తోంది. కేవలం పక్షులను వెళ్లగొట్టడమే పని.

పక్షులను ఎందుకు తరిమికొడుతున్నారు..?

మిస్టర్ చిప్స్ చిప్పీ కంపెనీ తయారు చేసేది ఫిష్ చిప్స్. అయితే చిప్స్ తయారీ కోసం సంస్థ చాలా చేపలను నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. చేపలను నిల్వ చేసే చోటుకు పక్షలు వస్తూ.. చేపలను తీసుకెళ్లిపోతున్నాయి. అమాంతం ముక్కుతో పట్టుకొని వెళ్తూ.. తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయి. పదో పదిహేను పక్షులు కాదు.. వందల సంఖ్యలో పక్షలు వచ్చి వేలల్లో చేప పిల్లలను తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే చిప్స్ కంపెనీ ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి వచ్చింది. ఏం చేయాలో తెలియక.. పక్షులను వెళ్లగొట్టేందుకు ఓ వ్యక్తిని పెట్టుకోవాలని చూస్తోంది. మిస్టర్ చిప్స్ చిప్పీ కంపెనీ యజమాని అలెక్స్ బోయ్డ్.. ఈ సరికొత్త ఉద్యోగాన్ని సృష్టించారు.

అతనికి దక్కిన అదృష్టం..!

సిగల్స్ నుంచి చేపలను కాపాడే వ్యక్తికి.. రోజుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించడంతో.. వందలాది మంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం పొంది.. సిగల్స్‌ను వెళ్లగొట్టడంలో విఫలం అయ్యారు. చాలా మంది ఇందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికీ అంతా విఫలం అయ్యారు. కానీ కోరీ అనే ఓ వ్యక్తి మాత్రం తన అద్భుతమైన టాలెంట్ తో ఈ పనిని సక్రమంగా చేసుకుంటూ కోటీశ్వరుడయ్యాడు. కోరీ.. డేగ వేషంలో వచ్చి అక్కడ ఉండగా.. ఎలాంటి పక్షి కానీ సిగల్ కానీ అక్కడకు వచ్చేందుకు ధైర్యం చేయలేదు. దీంతో కంపెనీ చాలా సంతోషించింది. అతడిని పర్మినెంట్ ఉద్యోగిగా మార్చేసి రోజులు 20 వేల జీతాన్ని అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version