Breaking : ఈ నెల 14 నుంచి వారాహిలో పవన్‌ ప్రచారం

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహుర్తం ఖరారయింది. ఈ నెల 14వ తేదీన అన్నవరంలో పూజలు చేసి వైఎస్ఆర్‌సీపీపై దండయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా తొలి విడత రూట్ మ్యాప్ ను జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ మనోహర్ ప్రకటించారు. తొలి విడత యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జరగనుంది. ప్రత్తిపాడు. పిఠాపురం కాకినాడ రూరల్, రాజోలు , నర్సాపురం ఇలా అన్న వరం నుంచి భీమవరం వరకూ యాత్ర సాగుతుందని నాదెండ్ల తెలిపారు. యాత్రలో భాగంగా ప్రతీ రోజూ..ఓ చోట్ల ఫీల్డ్ విజిట్ ఉంటుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

కొండగట్టు, బెజవాడ దేవాలయాలలో పూజలు అనంతరం వారాహి వాహనం మళ్లీ కనిపించలేదు.మంగళగిరి కార్యాలయంలో కూడా లేదు. ఎక్కడ ఉందో తెలియకపోవడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేసింది. ఇక వారాహి యాత్ర ఆగిపోయినట్లేనని కూడా ప్రచారం చేశారు. అయినప్పటికీ దీనిపై అటు పవన్ కల్యాణ్ నుంచి కానీ ఇటు జనసేన పార్టీ నేతల నుంచి కానీ ఎలాంటి ఖండన రాలేదు. అయితే వారాహి యాత్ర ఆలస్యానికి నాలుగు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించి డేట్స్ ఇచ్చేయడంతో నిర్మాత, దర్శకులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వరుస సినిమాలు చేస్తున్నారు.

అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో అది కాస్త వాయిదా పడింది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. దీనికి వారాహి యాత్ర పోటీ అవుతుందేమోన‌నే సందేహాలు ఉండటంతో కాస్త నెమ్మదించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ పెద్ద‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను నిలువ‌రించార‌ని.. రూట్ మ్యాప్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. బీజేపీ పెద్ద‌లు ఇప్పుడే వ‌ద్దు అని చెప్పార‌ని..అందుకే పవన్ కల్యాణ్ వారాహి యాత్రను పోస్ట్ చేశారని ప్రచారం జరిగింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version