కార్పోరేట్ ప్రపంచంలో ఉద్యోగులు నేర్చుకునే జీవితపు పాఠాలివే..

-

కార్పోరేట్ ప్రపంచంలో ఉద్యోగం ఊహించుకోవడానికి బాగానే ఉంటుంది. రంగుల ప్రపంచంలా కనబడే కార్పోరేట్ ఉద్యోగాల్లో వారికి మాత్రమే తెలిసే కొన్ని లోపాలు ఉంటాయి. జీతం ఎక్కువని భ్రమించి ఉద్యోగానికి వెళ్ళే చాలా మంది తమ జీవితాన్నే కోల్పోతున్నామని బాధపడుతుంటారు. ఐతే ప్రతీ కార్పోరేట్ కంపెనీ అలాగే ఉంటుందన్ని చెప్పడానికి వీలు లేదు. కార్పోరేట్ ముసుగులో ఉద్యోగులచే పని ఎక్కువ చేయించుకుంటూ అనవసర ఇబ్బందులకి గురి చేసే కంపెనీల్లో ఉద్యోగి జీవితం ఎలా ఉంటుందో ఇక్కద తెలుసుకోండి.

ప్రమోషన్ వచ్చిన కొద్దీ అహం కూడా పెరుగుతుంది. అప్పటి దాకా మీతో పాటు పని చేసిన వారు ప్రమోషన్ రాగానే కొద్దిపాటి అహన్ని ప్రదర్శిస్తారు. అందులో నువ్వు తక్కువ నేనెక్కువ అనే భావం స్పష్టంగా కనిపిస్తుంది.

కష్టపడి పని చేయడం కంటే ఎంత తెలివిగా చేసావన్న దానికే ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే కార్పోరేట్ కంపెనీల్లో కష్టపడవద్దు.

వారు చేసిన ఏ పనికీ ఫీడ్ బ్యాక్ రావాలని అనుకోరు. కానీ, ఇతరులు చేసిన పనికి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని ఎదురుచూస్తుంటారు.

తమ చేతకానితనాన్ని అవతలి వారి యూసర్ ఐడీలో దాచేస్తారు. అది తమ తప్పిదం కాదన్నట్టుగా ప్రవర్తిస్తారు.

నీ కుటుంబం, జీవితం అన్నీ మర్చిపోయే పరిస్థితి రావచ్చు. ట్రావెలింగ్ అన్న పదం మీ డిక్షనరీలోంచి తొలగిపోయే అవకాశం ఉంది.

ఎక్కువ పని చేసి దానివల్ల జీవితం మొత్తం పోయిందని బాధపడుతుంటారు. కానీ అప్పటికే సమయం అయిపోతుంది కాబట్టి చేసేది ఏమీ ఉండదు.

సిగరెట్ లేదా కెఫైన్ కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version