మూడో పెళ్లి చేసుకున్న మామ.. భార్య ఎవరో కాదు.. కోడలే..!

-

కట్టుకున్న వాడు చనిపోతే.. ఆ కుటుంబం జీవితం తలకిందులైపోతుంది..మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతారు.. కొందరు కొన్ని కారణాల వల్ల రెండో పెళ్లి చేసుకుంటారు.. ఎంత రెండో పెళ్లి అయినా.. వారి వయసుకు అటుఇటుగా ఉన్నవాళ్లనే చేసుకుంటారు.. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ మాత్రం చాలా డిఫ్రెంట్.. కొడుకును పోగట్టుకున్న తండ్రి.. భర్తను పోగొట్టుకున్న భార్య.. సొంత మామను పెళ్లి చేసుకున్న కోడలు.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని బర్హల్‌గంజ్ కొత్వాలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఛపియా ఉమ్రావ్‌ గ్రామానికి చెందిన 70 సంవత్సరాల కైలాష్ యాదవ్ తన కోడలు పూజ అనే 28సంవత్సరాల మహిళను వివాహం చేసుకున్నాడు. వాళ్లు ఇద్దరూ ఇష్టపడటంతో గుడికి వెళ్లి మరీ పెళ్లి చేసుకున్నారు. కోడలిని భార్యగా మార్చుకున్న మామ, కోడలి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
70 ఏళ్ల వృద్ధుడు కైలాష్ యాదవ్ బదల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి నలుగురు సంతానం. 12ఏళ్ల క్రితం తన భార్య చనిపోయింది. వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె తీరు కైలాష్ యాదవ్‌కు నచ్చకపోవడంతో విడాకులు ఇచ్చేశాడు.. ఈ క్రమంలోనే తన మూడో కుమారుడు వివాహం అనంతరం చనిపోయాడు. అతని భార్యే పూజ. కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ఒంటరిగా ఇంట్లోనే ఉంటోంది. కోడలు ఒంటరి తనాన్ని చూడలేకపోయిన కైలాష్ యాదవ్ ఆమెకు నూతన జీవితాన్ని ఇవ్వాలని మూడో పెళ్లి చేసుకున్నాడు…
అదే విషయాన్ని పూజకు చెప్పడంతో మామయ్య మాట నచ్చి..అతనితో జీవితాన్ని పంచుకోవడం ఇష్టంగా భావించి పెళ్లికి అంగీకరించేసిందట…అంతే సమాజం ఏమనుకున్నా..తమ మధ్య సంబందాన్ని తప్పు పట్టినా లెక్క చేయకుండా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం గుడిలో ప్రదక్షిణలు చేసి భార్యగా చేసుకున్న కోడలి నుదుటన తిలకం దిద్దాడు కైలాష్ యాదవ్.
కోడలి అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగింది.. పెళ్లికి గ్రామస్తులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వచ్చారు..ఈ అపూర్వ వివాహం విషయం పోలీసులకు చేరడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు.. వైరల్ అవుతున్న ఫోటో ద్వారానే ఈ వివాహం గురించి మాకు తెలిసిందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ బర్హల్‌గంజ్ చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.. కోడలికి కొత్త జీవితం ఇవ్వాలంటే.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి కానీ.. రేపో మాపో పోయే నువ్వెందుకు చేసుకున్నావ్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు కమెంట్‌ చేస్తున్నారు.. దీనిపై భిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version