సింగిల్‌గా ఉన్న అబ్బాయిలకు చాలా బెనిఫిట్స్‌ ఉన్నాయట.. మస్త్‌ ఇంట్రిస్టింగ్‌గా ఉందిగా..!

-

ఇన్‌స్టా ఓపెన్‌ చేస్తే చాలు.. సింగిల్‌ ఫర్‌ఎవ్వర్‌ మీమ్స్‌ కనిపిస్తుంటాయి.. కొంతమంది లవర్‌ లేక నాకు నైట్‌ నిద్రపట్టడం లేదంటూ తెగ ఫీల్‌ అవుతారు.. సింగిల్‌గా ఉన్నందుకు వాళ్లుకు వాళ్లే రీగ్రేట్‌ అవుతారు.. సింగిల్‌గా ఉండటం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..? ముఖ్యంగా అబ్బాయిలకు..ఈ మధ్యే జరిగిన ఓ అధ్యయనంలో చాలా ఇంట్రస్టింగ్‌ విషయాలు తెలిశాయి.. సింగిల్‌గా ఉండే అబ్బాయిలకు చాలా లాభాలు ఉన్నాయట.. మరి ఆ ముచ్చటేందో జర మీరు చూసేయండి..!

ఒంటరిగా ఉండటం అంత చెడ్డది కాదు.. ఒంటరిగా ఉండటం వల్ల స్వేచ్ఛ మాత్రమే లభిస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీకు ఈ ప్రయోజనాలు తెలిస్తే, ఒంటరిగా ఉన్న వారి పట్ల జాలి కలగదేమో.

ఒత్తిడి..

ఒంటరిగా ఉన్న చాలా మందికి వారి జీవితంలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మనకు ఈరోజుల్లో ఒత్తిడి కలిగించే మార్గాలు చాలా ఉన్నాయి.. ఇప్పటికే.. ఆఫీసుల్లో బాస్‌ వల్ల, ఆ పని వల్ల ఒత్తిడిగా ఫీల్‌ అవుతుంటాం..మీదికెళ్లి మళ్లీ ఈ లవర్‌ లొల్లి.. ఇది ఆఫీస్‌ టెన్షన్‌ కంటే ట్రిబుల్‌ ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి వల్ల మనిషి చాలా కుంగిపోతాడు.. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు సంపాదించి, మీ కోసం ఖర్చు చేయాలి. తద్వారా మరొకరిపై ఖర్చు చేసే భారం తగ్గుతుంది. అదే మీకు భాగస్వామి ఉంటే.. వారి కోసం కూడా మీరే ఖర్చుచేయాలి.. పోనీ మీరు చేసినా వాళ్లు హ్యాపీగా ఫీల్‌ అవుతారా అంటే.. వాళ్లు సంతృప్తి చెందరు. కొన్నిసార్లు వాళ్లు అడిగిన కోరికలు తీర్చలేకపోతున్నాం అన్న మనోవేదన మిమ్మల్ని చాలా బాధిస్తుంది.

ఫ్యామిలీతో కనెక్షన్‌…

ఒంటరి వ్యక్తులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువగా కనెక్ట్ అవ్వడమే కాకుండా, అవసరమైనప్పుడు సహాయం చేయగల మెరుగైన నెట్‌వర్క్‌ను వీరు కలిగి ఉంటారట. బంధంలో లేని వ్యక్తులు తమ తోటివారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. తమ లక్ష్యంలో అధిక ఫలితాలను సాధిస్తారు.

ఫిట్‌గా..

ఒంటరి వ్యక్తులు ఎక్కువ వ్యాయామం చేయడం, ఫిట్‌గా ఉన్నట్లు కూడా అధ్యయనంలో తెలిసింది..వారు అందంగా కనిపించాలని, సెంటర్‌ ఆఫ్‌ యట్రాక్షన్‌ వాళ్లే అవ్వాలని కోరుకుంటారట.. ఇది వారి ఆరోగ్యానికి మంచిది. గుండె సమస్యలు, ఊబకాయం, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన తాజా అధ్యయనం ప్రకారం.. ఒంటరిగా ఉన్నవారు జిమ్‌లో చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఒంటరి పురుషులు ఎక్కువ ఆరోగ్య స్పృహతో ఉన్నట్లు కనుగొనబడింది.

మంచి నిద్ర..

ఇక నైట్‌ నైట్‌ఔట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అక్కడ పనికొచ్చే విషయం అంటూ ఏం ఉండదు.. కానీ దేశరాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లు గంటల గంటలు కబుర్లు చెప్పుకుంటారు.. అవును బాగుంటుంది..మీ పార్టనర్‌తో మాట్లాడుతుంటే.. కానీ రాత్రుళ్లు నిద్రమాని.. ఒంటిగంట, రెండు అయినా కూడా..ఇంకా.. చెప్పు..నువ్వే చెప్పు అంటూ కొలిక్కిరానీ ముచ్చట పెడతారు.. అదే సింగిల్‌గా ఉన్నవాళ్లకు ఈ లొల్లి అంతా ఉండదు.. తిన్నామా.. కాసేపు సోషల్‌ మీడియాలో టైమ్‌ స్పెండ్ చేశామా..దోస్తుగాడికి ఫోన్‌ చేసి గాసిప్స్‌ షేర్‌ చేశామా అంతే.. ఎంతలేదన్నా.. పార్ట్‌నర్‌ ఉన్నవాళ్లకంటే.. సింగిల్‌గా ఉన్నవాళ్లు త్వరగా నిద్రపోతారు.. పైగా వీళ్లు ప్రశాంతమైన నిద్రను పొందుతారట..

టైమ్‌

మీరు రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు, మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి సమయం కేటాయించాలి. మీ కోసం సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఇతరుల కోసం సమయాన్ని త్యాగం చేయవలసిన అవసరం లేదు. మీరు మీ స్వంత ప్రాధాన్యతలపైనే దృష్టిపెట్టొచ్చు.. మీరు బంధంలో ఉన్నప్పుడు మీ కోసం సమయం కేటాయించాలనుకుంటే, అది మీ బంధాన్ని ప్రభావితం చేస్తుంది. నాకు టైమ్‌ ఇవ్వడం లేదు..అనే పంచాయితీ మీ పార్ట్‌నర్‌ నుంచి బాగా వస్తుంది.

సో.. ఇందుమూలంగా సింగిల్‌ బాయ్స్‌కు చెప్పేదేంటే.. మీరే ఎక్కువగా హ్యీపీగా ఉంటున్నారట.. ఓ.. లవర్‌ లేదని ఫీల్‌ అయి అనవసరంగా పరేషన్ కాగండి మరీ.! అలా అని లవర్‌ ఉన్న ప్రతి అబ్బాయి ఆనందంగా లేడని కాదు.. కేరీర్‌ను పక్కన పెట్టి భాగస్వామితోనే ఎక్కువ టైమ్‌ వెచ్చిస్తే.. కొన్నిరోజులకు మీరే తప్పు తెలుసుకుంటారు. ఎవరో పెళ్లి చేసుకునే అమ్మాయికోసం.. మీరు రాత్రుళ్లు నిద్రలు మాని మరీ చాటింగ్‌ చేసి, ముసి ముసి నవ్వులు నవ్వతూ ఎన్నాళ్లు ఇంకా..? అంటే ఇది కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మీమే అనుకోండి..!!! కానీ నిజమే కదా.!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version