పెళ్లి విందులో పన్నీర్‌ పెట్టలేదని గొడవ.. బెల్టులతో కొట్టుకున్న బంధువులు

-

పెళ్లి అంటేనే పెద్ద లొల్లి అయిపోయింది. చేసుకునే వాళ్ల సంగతి పక్కనపెడితే.. ఈ బంధువులు, వారి మర్యాదలు, హంగులు, ఆర్భాటాలు అమ్మో.. ఇదంతా పెద్ద కథ.. భోజనాల్లో మగపెళ్లి వాళ్లు ఏం పెట్టమట్టారో అవే పెట్టాలి. మొన్నటికిమొన్న తెలంగాణలో ఓ పెళ్లిలో చికెన్‌ వేయలేదని ఇరువర్గాలు ఘర్షణపడ్డాయి. ఇప్పుడు పన్నీర్‌ వేయలేదని గోలగోల.. అసలు పెళ్లి సంతోషంగా ఉండటం కోసం చేసుకుంటున్నారు.. గొడవలు పడటానికి చేసుకుంటున్నారా అర్థంకావడం లేదు. బెల్టులు తీసుకోని మరీ కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్ పత్‌లో గురువారం ఓ వివాహం జరిగింది.. అయితే ఆ వివాహ విందులో వరుడి తరఫు బంధువు ఒకరు గొడవకు దిగారు. వివాహ విందులో పనీర్ పెట్టలేదని.. అలా పెట్టకుండా ఎలా ఉంటారని వాగ్వాదానికి దిగారు.
ఇది కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. మాటా మాటా పెరిగి ఇరు వర్గాల వాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బెల్టుతో కొట్టుకున్నారు. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకొని… దాడికి పాల్పడ్డ వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో అందరినీ విడిచి పెట్టారు.
అసలు పెళ్లిలో గొడవలు క్రియేట్‌ చేసేది ఎవరో తెలుసా.. పెళ్లికొడుకు లేదా పెళ్లికుమార్తెకు బాగా దూరపు బంధువులు..దగ్గరి వాళ్లు బానే రడీ అవడం మీద ఫోకస్‌ పెడతారు. పెళ్లిహడావిడీలో ఉంటారు. ఈ దూరపు బంధువులే.. ఖాళీగా ఉండి ఏదో ఒక లొల్లి క్రియేట్‌ చేస్తారు. అది కాస్త పెంట పెంట అవుతుంది. ఇది మేం చెప్పడం లేదండోయ్.. నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా తేలిన విషయం ఇదే.!

చికెన్‌ లేదని పెళ్లి ఆపేసిన స్నేహితులు..

హైదరాబాద్ షాపూర్ నగర్‌లో ఓ పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. జగద్గరిగుట్ట రింగ్ బస్తీకి చెంది వరుడు, కుత్బుల్లాపూర్‌కు చెందిన వధువుకు వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే షాపూర్ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్ లో విందు ఏర్పాటు చేశారు. ఆడ పెళ్లి వారు బిహార్ కు చెందిన మార్వాడీ కుటుంబీకులు కావడంతో శాకాహార వంటలు చేశారు. అయితే విందు ముగింపు దశలో పెళ్లి కుమారుడి స్నేహితులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదంటూ గొడవకు దిగారు. శాఖాహారం మేం తినమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రంమలోనే ఇరుపక్షాల మధ్య గొడవ జరిగింది.
అయితే వెంటనే పెళ్లి కుమార్తె కుటుంబీకులు జీడిమెట్ల సీఐ పవన్‌ను కలిసి విషయాన్ని తెలిపారు. స్పందించిన ఆయన ఇరు కుటుంబ సభ్యులను, వధూవరులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలన్నీ మర్చిపోయిన తర్వాత రోజు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇలా కథ సుఖాంతమైంది.
పెళ్లికి వచ్చి పెట్టింది తిని వెళ్తే ఏ గోలా ఉండదు.. నీకు ఇష్టమైనది కావాలంటే.. వెళ్లి మీ ఇంట్లో చేసుకోని తిను.. వివాహ వేడుకలో ఎందుకు గోల చేస్తారు అని నెటిజన్లు వీరిపై తెగ మండిపడుతున్నారు. ఇంతకీ ఈ ఘటనలపై మీ వర్షన్‌ ఏంటో..!

https://twitter.com/ImAdiYogi/status/1623610976108183552?t=NRpo6VCNMjHW9-qavG3hFA&s=19

Read more RELATED
Recommended to you

Exit mobile version