మన దేశంలో ఎక్కువమంది చెప్పే అబద్దాలు ఇవే..!

-

ఒక్కొక్క సారి మనం అబద్దాలని కూడా చెప్తూ ఉంటాము, ఎవరైనా రమ్మన్నప్పుడు మనకి వీలు కుదరకపోయినా లేకపోతే మనకి వెళ్లడం ఇష్టం లేకపోయినా ఏదైనా పని లో బిజీగా ఉన్నా అబద్దాలు చెప్తూ ఉంటాము, అయితే ఎక్కువ మంది మన ఇండియాలో ఈ అబద్ధాలుని చెప్తూ ఉంటారు. మరి ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాల గురించి ఇప్పుడు చూసేద్దాం. చాలా మంది రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నాను పక్కనే ఉన్నాను అని అబద్ధాన్ని చెప్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు ఎక్కడో ఉంటారు రావడానికి గంట పడుతుంది అయినా కూడా రెండే నిమిషాల్లో వస్తానని అంటూ ఉంటారు. మీరూ ఈ అబద్దం చెప్పే వుంటారు.

అలానే వ్యసనాలు ఉన్న వాళ్ళు కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు రేపటి నుండి మందు మానేస్తాను. రేపటి నుండి సిగరెట్ మానేస్తాను ఒట్టు అని అంటూ ఉంటారు. ఇలా ఈ అబద్ధం ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. అలానే ఫోన్ సైలెంట్ లో ఉంది చూసుకోలేదని కూడా చాలామంది చెప్పే అబద్ధం. డబ్బులు కావాలా అయ్యో ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు నిజంగా నమ్మండి అని అంటుంటారు కొంతమంది. ఇది కూడా చాలా మంది చెప్పే అబద్ధం.

ఒకవేళ ఎవరైనా ఎక్కడికైనా రమ్మంటే పనుంది నేను రాలేను అని ఈజీగా అబద్ధం చెప్తుంటారు చాలా మంది ప్రియుడుతో కానీ ప్రేయసి తో కానీ నువ్వే నా ఫస్ట్ లవ్ అని అంటూ ఉంటారు ఇది కూడా చాలా మంది చెప్పే అబద్ధం. ఇంకొంతమంది అయితే నేను అసలు అబద్ధాలు చెప్పను ఎప్పుడూ నిజమే చెప్తాను అని అబద్ధం చెప్తూ ఉంటారు ఇలా ఇండియాలో చాలామంది ఈ అబద్ధాలని చెప్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news