బహిష్టు పరిశుభ్రత దినం: ఆడపిల్లగా పుట్టాక.. పిరియడ్స్‌ను ఫేస్ చేయాల్సిందే.. ఒక దశ వరకూ వీటిని భరించాల్సిందే.. పాపం మహిళలకు… పిరియడ్స్‌తో చాలా సమస్యలు ఉంటాయి.. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ.. ఈరోజు మెన్సుట్రువల్ హైజిన్ డే.. పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, ఋతుస్రావం చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించడానికి, పీరియడ్స్ సంబంధిత ఉత్పత్తులకు సంబంధించి ఆడవారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన పెంచడానికి మే 28న ఋతుచక్ర పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తారు.
ఈరోజే ఎందుకంటే..
ఋతుచక్ర పరిశుభ్రత రోజును మే 28న తేదీనే నిర్వహించటం వెనుక కూడా ఒక అర్థం ఉంది. పీరియడ్ సైకిల్ ప్రతీనెల ఉంటుంది. ఇది సగటున 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. అందుకే 28వ తేదీని ఎంచుకున్నారు. అలాగే ఈ పీరియడ్స్ అనేవి సగటున 5 రోజుల పాటు కొనసాగుతాయి. మనకు సంవత్సరంలో ఐదవ నెల మే, అందుకే మే 28వ తేదీని ఋతుచక్ర పరిశుభ్రత రోజుగా ఎంచుకున్నారు.
ఋతుచక్ర పరిశుభ్రత దినోత్సవం 2023 ఏడాది థీమ్ ఏమిటంటే.. ‘2030 నాటికి పీరియడ్స్ అనేవి సాధారణ ప్రక్రియ, వీటిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేకుండా మార్చడం. 2013లో జర్మనీకి చెందిన వాష్ యునైటెడ్ ఆనే NGO మెన్‌స్ట్రువల్ హైజీన్ డేను ప్రారంభించింది. 28 రోజుల సోషల్ మీడియా ప్రచారం.. ఋతుస్రావం వివిధ అంశాల గురించి అవగాహన కల్పించడానికి ప్రారంభించారు. వీరు ప్రచారానికి వచ్చిన సానుకూల స్పందనతో ప్రేరణ పొంది మరిన్ని ర్యాలీలు, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, ప్రసంగాలు నిర్వహించారు. ఈ క్రమంలో మొదటిసారిగా మే 28, 2014న ఋతుచక్ర పరిశుభ్రత దినోత్సవాన్ని పాటించారు.
ఋతుచక్ర పరిశుభ్రత అంటే ఋతుస్రావం సమయంలో రక్త ప్రవాహాన్ని గ్రహించే లేదా సేకరించే ఉత్పత్తుల వాడకం మొదలుకొని, పీరియడ్ ఉన్నన్నీ రోజులు యోని ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ప్యాడ్‌ను నాలుగు గంటలకు ఒకసారి మార్చుకోవాలి. చాలా మంది.. బ్లీడింగ్ అవ్వడం లేదు కదా.. ఎందుకులే అనుకుంటారు. కానీ కచ్చితంగా మార్చుకోవాలి.