ఇదేందిది.. ఇక్క‌డ గుర్రం ఎటు న‌డుస్తుంద‌బ్బా..!

సోషల్ మీడియాలో పజిల్స్ షేర్ చేసే వాళ్లకు కొదువే ఉండదు. చాలా మంది ఆసక్తికరంగా ఉన్న పజిల్స్ ను షేర్ చేస్తుంటారు. వీటిని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తూ ఉంటారు. జనాలకు ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే చాలా మంది సోషల్ మీడియాలో ఇలాంటి పజిల్స్ పోస్టు చేస్తుంటారు. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. పజిల్ మాదిరిగానే ఉన్న వీడియోను చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..దమయంతి అనే పేర ఉన్న యూజర్ ఐడీలో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల బుర్రకు పని పెడుతోంది. ఈ వీడియోలో ఉన్న గుర్రం ఎటు వైపు నడుస్తుందో చెప్పాలని కాంటెస్ట్ పెట్టారు.

గుర్రం ఎడమ వైపు వెళ్తున్నట్లు అనిపిస్తే రైట్ బ్రెయిన్ పర్సన్ అని, కుడివైపుకు వెళ్తున్నట్లు అనిపిస్తే లెఫ్ట్ బ్రెయిన్ పర్సన్ అని తేల్చి చెప్పారు. కానీ ఇది చూసిన చాలా మంది నెటిజన్లు అసలు గుర్రం ఎటు వైపుగా నడుస్తుందో చెప్పడం చాలా కష్టం అని అంటున్నారు. ఇదంతా సులభం కాదని చెప్పేస్తున్నారు. ఈ వీడియో వెనుక ఏదైనా పరిశోధన దాగి ఉందా? అని తిరిగా ప్రశ్నిస్తూ… కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన ప్రతి నెటిజన్ ఆశ్చర్యపోతూ… కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే గుర్రం వెనుకకు నడుస్తుందని తేల్చి చెబుతున్నారు. ఇలా సరదాగా ఉన్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. అనేక మంది దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.