ఓటు.. దాని ప్రాధాన్యత, ఓటు వేయాల్సిన అవసరం.. ఇంకా ఓటు హక్కు ఇలా ఓటు గురించి ఎన్ని చెప్పినా.. చివరకు పోలయ్యే ఓటింగ్ శాతం ఎంత. మా.. అంటే 60 శాతమో… 70 శాతమో.. మరి.. మిగితావాళ్ల సంగతి. అంతే.. మిగితా వాళ్లకు ఓటేసేంత తీరిక లేకపోవచ్చు.. లేదా ఆ.. నేనొక్కడినీ ఓటేయకపోతే పోయేదేముందిలే అని అనుకొని ఉండొచ్చు. మన దేశంలో అయితే ఓటేయకపోయినా పర్వాలేదు. ఎవరూ ఏమీ అనరు. కానీ.. కొన్ని దేశాల్లో మాత్రం చట్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఓటేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో సింగపూర్ ఒకటి.
సింగపూర్ లో ఓటేయకపోతే ఓటేయని వారి పేరును ఓటర్ల జాబితా నుంచి తీసేస్తారట. దీంతో వాళ్లు మళ్లీ ఓటేసే అధికారాన్నే కోల్పోతారన్నమాట. ఒకవేళ ఓటు వేయలేకపోతే ఎందుకు ఓటు వేయలేకపోయారో… ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉంటుందట. అప్పుడు మాత్రమే వాళ్ల పేరును తిరిగి జాబితాలో చేరుస్తారట. ఓటేయని వాళ్లను లిస్ట్ ఔట్ చేసి వాళ్లకు చెప్పకుండానే పేర్లు తొలగిస్తారట అధికారులు. అందుకే.. అక్కడ ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందట. అందుకే అది సింగపూర్ అయింది. చూడటానికి చిన్న దేశమే అయినా.. అక్కడి ప్రజలు ప్రతిదీ పక్కాగా ఫాలో అవుతారు. ఇప్పుడు సింగపూర్ ప్రపంచానికే సవాల్ విసురుతున్నదంటే దానికి కారణం అత్యధిక ప్రజలు కోరుకున్న ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కావడమే. ఇక.. మన దేశంలోని ఎన్నికల వ్యవస్థ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.