రక్త సంబంధాన్ని కలిపిన టిక్ టాక్ ..!

-

ఇప్పటివరకు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం టిక్ టాక్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. టాలెంట్ బయటకి తీస్తున్నారు అని కొందరు అంటే వీటి వల్ల నష్టాలే తప్ప ప్రయోజనం లేదు అని మరికొందరు అన్నారు. వీటన్నింటినీ పక్కన పెడితే ఈ టిక్ టాక్ ఒక కుటుంబానికి దూరమైన వ్యక్తిని వెతకడం లో సహాయపడింది. ఆరేళ్ల క్రితం పుల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో జరిగిన చిన్న గొడవకు కోపగించుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా దొరకలేదు. కోపం తగ్గాక వస్తాడు అని ఎదురు చూశారు. అలా యేళ్లు గడిచిన పుల్లయ్య తిరిగి రాలేదు కనీసం ఆచూకీ లభించలేదు. అయితే కుటుంబ సభ్యులు పుల్లయ్య చనిపోయి ఉండవచ్చని భావించి అతని మీద ఆశ వదిలి ప్రతి సంవత్సరం కర్మ కాండలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంతలో పుల్లయ్య ఇద్దరు కొడుకుల్లో ఒకడైన నరిశింహులు రోజు టిక్ టాక్ వీడియో లు చూస్తూ ఉంటాడు. ఒక రోజు నరసింహులు కు ఒక ఐడియా వచ్చింది.

తప్పిపోయిన తన తండ్రి వివరాలతో ఒక టిక్ టాక్ చేసి పోస్ట్ చేశాడు. అలా షేర్ అయిన వీడియో ను గుజరాత్ లో ఉన్న ఒక వ్యక్తి చూసి పుల్లయ్య ను గుర్తించి కుటుంబ సభ్యులకు పుల్లయ్య గుజరాత్ లో ఉన్న  తెలియ జేశాడు. వెంటనే పుల్లయ్య కొడుకులు ఇద్దరు గుజరాత్ వెళ్లి తండ్రిని చూసి ఆనందపడి ఇంటికి తీసుకువచ్చారు. పుల్లయ్య ను చూసిన కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ రకంగా టిక్ టాక్ ఆరేళ్ల క్రితం విడిపోయిన తండ్రి కొడుకులను దగ్గరచేసింది. ఇది చూసి అన్నింటిలోనూ తప్పులే కాదు ఒక్కోసారి మంచి కూడా జరుగుతుంది అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version