డెత్: మేడిన్ చైనా…!

-

సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చైనాను మించిన దేశం లేదు. ప్రపంచంలో ప్రతీ దేశంలో చైనా ఉత్పత్తులు ఉంటాయి. ఫోన్, బ్యాటరి, లైట్స్, వాహనాల్లో వాడే కొన్ని పరికరాలు, గ్యాడ్జేట్ ఇలా ఏది చూసిన సరే మేడిన్ చైనానే. మన దేశంలో ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంట్లో ఏదోక చైనా ఉత్పత్తి కచ్చితంగా ఉంటుంది. ఎన్నో సరికొత్త వస్తువులను ప్రపంచానికి పరిచయం చేసింది. వంటింటి నుంచి ఆఫీస్ వరకు ప్రతీ ఒక్కటి.

అలాంటి చైనా ఇప్పుడు చావుని కూడా ప్రపంచానికి అందించింది. చావుని కూడా తన దేశంలో వెకిలి ఆహారపు అలవాట్లతో పరిచయం చేసింది. ఒక్క మనిషిని మినహాయించి ప్రతీ జీవిని తినే అలవాటు ఉన్న ఆదేశ ప్రజలు ఇప్పుడు చావుని ప్రపంచానికి అందించడం ఆందోళన కలిగించే అంశం. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా వైరస్ నరకం చూపిస్తుంది.

అసలు చైనాతో వాణిజ్యం చేయని దేశాలకు కూడా ఇప్పుడు కరోనా వచ్చింది. గల్ఫ్ దేశాలకు కరోనా వ్యాప్తి అనేది భయపెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా, భారత్, అమెరికా ఇలా అన్ని దేశాల్లో కరోనా చెలరేగిపోతుంది. ఆ దేశంలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతుంది కరోనా వైరస్. అసలు ఊహకి అందని విధంగా గాలి కంటే వేగంగా విస్తరిస్తుంది కరోనా వైరస్.

ప్రపంచానికి అన్ని రకాల ఉత్పత్తులను అందించిన చైనా ఇప్పుడు చావుని కూడా అందించింది. అన్ని దేశాలు కరోనా విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దాదాపు అన్ని ఖండాలకు కరోనా విస్తరించింది. చైనాలో మరణాలు ఆగడం లేదు. వేలాది మంది చావుకి దగ్గరలో ఉన్నారు. వ్యాక్సిన్ కూడా ఆ దేశమే కనుక్కుని ఉంటే బాగుండేది. మరి ఎప్పటికి ఆగుతుందో ఏమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version