ప్రతి ఒక్కరి ఇంట్లో విద్యుత్ వినియోగం ఒకే విధంగా ఉండదు మరియు వినియోగం ప్రకారం కరెంట్ బిల్లు ప్రతి నెల వస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో కరెంట్ బిల్లు ఎక్కువగా రావడం సహజమే. అయితే, సహజంగా కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలను పాటించాలి. సాధారణమైన బల్బులు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి, దాని వలన కరెంటు బిల్లు చాలా ఎక్కువ అవుతుంది. కనుక కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే ఎల్ఈడి బల్బులను ఉపయోగించాలి. వీటిని ఉపయోగించడం వలన కరెంటు బిల్లు తక్కువ అవుతుంది. పైగా ఎల్ఈడి బల్బులను ఉపయోగిస్తే ఇవి ఎక్కువ కాలం పాటు పని చేస్తాయి.
అంతే కాకుండా, చాలామంది ఎలక్ట్రిక్ వస్తువులను ఉపయోగించిన తర్వాత వాటిని స్విచ్ ఆఫ్ చేయకుండా ప్లగ్ తీసేస్తారు. ముఖ్యంగా సెల్ ఫోన్ చార్జర్లు, ఐరన్ బాక్స్, వాషింగ్ మిషన్స్, టీవీలు వంటి ఇతర వస్తువులను ప్లగ్ తీసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోకూడదు.వేసవికాలంలో అందరూ ఎక్కువగా ఏసీని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, సంవత్సరానికి ఒక్కసారైనా ఏసీ మెకానిక్ తో సర్వీస్ చేయించుకోవాలి. ఇలా చేయడం వలన విద్యుత్ తక్కువగా ఖర్చవుతుంది మరియు ఏసీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. దీంతో పాటు, ఏసీలో ఉండే ఫిల్టర్ ను కూడా క్లీన్ చేసుకోవాలి. దీనిని తరుచుగా క్లీన్ చేయడం వలన అనవసరమైన విద్యుత్ ఖర్చు తగ్గుతుంది.
చాలామంది సమయం లేకపోవడం వలన వాషింగ్ మిషన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, వీటిని అధికంగా ఉపయోగిస్తే కరెంట్ బిల్లు చాలా ఎక్కువ అవుతుంది. కనుక తక్కువ బట్టలు ఉన్నప్పుడు వాషింగ్ మిషన్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. కరెంట్ బిల్ వినియోగాన్ని తగ్గించాలంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేసే ముందు వాటి స్టార్ రేటింగ్స్ ను చూసుకోవాలి. దానివలన కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది. ఇంట్లో సూర్యరశ్మి ఎక్కువగా వస్తున్నట్లయితే లైట్స్, ఫ్యాన్స్ వినియోగం తగ్గించుకోవాలి. అలాగే, బయటకు వెళ్లే ముందు లైట్లు, హ్యాండ్, టీవీలు వంటివి స్విచ్ ఆఫ్ చేసి వెళ్లాలి. ఇటువంటి జాగ్రత్తలను పాటించడం వలన కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది.