సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఎవ్వరితోనైనా మాట్లాడగలుగుతున్నాం. సంబంధాలు పెట్టుకోగలుగుతున్నాం. ఖండాలు దాటి ఎక్కడో ఉన్న వారి మనసుతో కనెక్ట్ కాగలుగుతున్నాం. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత లాంగ్ డిస్టేన్స్ రిలేషన్స్ బాగా పెరిగాయి. ఐతే ఈ సాధారణంగా మనతో పాటు ఉండే వారితో బంధానికి, మనకి దూరంగా ఉంటూ ఫోన్ ద్వారా మాత్రమే సాగే బంధానికి చాలా తేడా ఉంది. అలా ఫోన్ ద్వారా మాత్రమే సాగే బంధం గట్టిగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఒప్పుకోలు
ఇద్దరు మనుషులు దూరంగా ఉన్నప్పుడు వారిద్దరికీ చాలా సందేహాలు ఉంటాయి. అవతలి వ్యక్తి గురించి అంతలా వెయిట్ చేయడం అవసరమా? మన గురించి వారు అలాగే ఎదురుచూస్తున్నారా లేదా అన్నది సందేహం. ఇక్కడ అవన్నీ పక్కన పెట్టాలి. ఉద్యోగం కారణమో, లేదా మరింకోటో కానీ దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఆ నిజాన్ని ఇద్దరూ నమ్మాలి. అలా నమ్మితేనే బంధం గట్టిపడి ఎలాంటి అనవసర ఆలోచన రాకుండా ఉంటుంది.
కమ్యూనికేషన్
దూరంలో ఉన్నవారితో సంబంధం గట్టిగా ఉండాలంటే కమ్యూనికేషన్ తప్పనిసరి. మీరు చెప్పే ప్రతీ మాటలో నిజం ఉంటే బంధం పెరుగుతుంది. రోజు రోజు విషయాలు పంచుకుని అవతలి వారు కూడా మీతో ఉన్నట్టే మీకనిపించాలి. అదీగాక కమ్యూనికేషన్ ని ఒక బాధ్యతగా కాకుండా ఫీల్ అవుతేనే ప్రయోజనం ఉంటుంది.
బ్యాలన్స్
ఆధారపడే విషయాల్లో బ్యాలన్స్ గా ఉండండి. మీ అవసరం వారికి ఉందని తెలిసి, గొప్పలకి పోవద్దు. అది వారిని మరింత అయోమయంలో పడేస్తుంది.