కార్యకర్తలకే డబుల్ బెడ్రూం ఇల్లు.. ఆత్మహత్యే శరణ్యమంటున్న భూ బాధితులు!

-

ఖమ్మంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం భూమిని పోగొట్టుకున్న తమకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు డబుల్ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కేటాయిస్తున్నారని స్థానికంగా ఉండే దళిత భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హామీని ప్రస్తుత కాంగ్రెస్ తుంగలో తొక్కిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చస్తామని బాధితులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం, ఆచర్లగూడెం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం దళితుల నుంచి గత ప్రభుత్వం భూమి తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది. అప్పట్లో భూములు కోల్పోయిన వారికి ఇళ్లు ఇస్తామని గత కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇవ్వగా..ఆ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే మంత్రి పొంగులేటి అనుచరులు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తున్నదని దళితులు ఆరోపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version