కొత్త బట్టలు రంగు వదిలేయకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

కొత్త బట్టలు ఉతికినప్పుడు.. ఉతికిన బట్టల నీళ్ళని చూస్తే మనకి రంగు వదిలేయడం కనపడుతూ ఉంటుంది. చాలా కొత్త బట్టలు రంగు వదిలేస్తూ ఉంటాయి. ఈ సమస్య తరచూ మనకి కనబడుతూనే ఉంటుంది. అయితే కొత్త బట్టలు రంగు వదిలేయకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఈ విధంగా కనుక మీరు పాటించారంటే కచ్చితంగా కొత్త బట్టలు రంగు వదిలేయకుండా ఉంటాయి. కొత్త బట్టలు రంగు వదిలేయకుండా అదే రంగుతో ఉండాలంటే బకెట్ లేదా టబ్లో 10 నుండి 12 లీటర్ల నీళ్లు తీసుకోండి. దానిలో పట్టిక రెండు దోసెల్లో ఉప్పు వేయండి.

చల్లని నీళ్లు మాత్రమే తీసుకోండి. ఈ నీటిలో దుస్తులుని కనీసం రెండు గంటల పాటు నానబెట్టండి రెండు గంటలు అయిన తర్వాత దుస్తులు ఒక్కొక్కటి తీసేయండి. తర్వాత మీరు శుభ్రమైన నీటి లో నానబెట్టి ఉతుక్కోవాలి. కొన్ని దుస్తులు ఈ టైం లో రంగుని వదిలేస్తూ ఉంటాయి ఆ తర్వాత మళ్లీ రంగు వదలవు. ఇలా సింపుల్ గా మీరు ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు.

అలానే కొన్ని బట్టలు గట్టిగా ఉంటాయి. పెళుసుగా మారిపోతాయి. దుస్తులు పెళుసుగా పోయి సాఫ్ట్ గా ఉండాలంటే ఒక బకెట్ తీసుకొని అందులో కొంచెం వెనిగర్ ని వేయండి. వెనిగర్ వేసిన తర్వాత నీటి లో దుస్తులని నానబెట్టండి. నానబెట్టిన వాటిని తీసి ఆరేసుకోండి. ఇలా సింపుల్ గా ఈ సమస్యని మీరు పరిష్కరించుకోవచ్చు. ఇలా ఈ సింపుల్ టిప్స్ ని పాటిస్తే సులభంగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు. కొత్త బట్టలు రంగే వదలవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version