హోస్టెస్ లు ట్రెయిన్ లో కూడా ఉంటే. అరె.. ఇదేదో బాగుంది కదా. అవును.. విమానాల్లో లాగానే రైళ్లలో కూడా హోస్టెస్ సేవలను ఉపయోగించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమవుతోంది.
ఎయిర్ హోస్టెస్ తెలుసు కదా. ఎప్పుడూ ముఖంలో చెరగని చిరునవ్వు. ప్రయాణికులు విసుక్కున్నా.. ఏమాత్రం కొప్పడకుండా వాళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు. ఎటువంటి అసహనం ప్రదర్శించరు. విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ఉండటం కామన్. ప్రయాణికులకు ఫుడ్ దగ్గర్నుంచి.. వాళ్లకు ఉన్న సమస్యలన్నింటినీ వాళ్లు తీరుస్తారు.
అదే హోస్టెస్ లు ట్రెయిన్ లో కూడా ఉంటే. అరె.. ఇదేదో బాగుంది కదా. అవును.. విమానాల్లో లాగానే రైళ్లలో కూడా హోస్టెస్ సేవలను ఉపయోగించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమవుతోంది.
వీళ్లను ట్రెయిన్ హోస్టెస్ అని పిలుస్తారు. యువతులు మాత్రమే కాకుండా… మేల్ స్ట్యూవర్డ్స్ ను కూడా నియమించుకోనున్నారు. ఇప్పటికే ట్రెయిన్ హోస్టెస్ సేవలను గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే అన్ని రైళ్లలోనూ వీళ్ల సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దాని కోసం ఐఆర్సీటీసీ రెండు వేల మంది హోస్టెస్ లకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పూర్తికాగానే అన్ని రైళ్లలో వీళ్ల సేవలు ప్రారంభం కానున్నాయి.
రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తినా.. ఆహారం, మంచి నీళ్లు, ఆరోగ్య సమస్యలపై కానీ.. ట్రెయిన్ హోస్టెస్ లు వెంటనే స్పందిస్తారు. అది సంగతి.