ఇదేం రెస్టారెంట్ రా సామి..!

-

భోజన ప్రియులకు సాదారణంగా ఫుడ్ తో పాటుగా, హోటల్ లో ఉండే వాతావరణం కూడా బాగుండాలి అప్పుడే మల్లీమల్లీ అదే హోటల్ కు వెళతారు.. కానీ ఈ మధ్య ఆన్‌లైన్ ఆర్డర్లు ఎక్కువ కావడంతో హోటల్స్ చాలా వరకు మూత పడుతున్నాయి.దీంతో హోటల్ యాజమాన్యం భోజన ప్రియులను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వెలుగులోకి వచ్చింది. రైలు సర్వీస్..ఈ పేరు వినడానికి కొత్తగా ఉంది కదూ..కానీ హోటల్ లోపల చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది.

 

మామూలుగా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తే మనుషులు వచ్చి ఫుడ్ ను అందిస్తారు.కానీ ఓ హోటల్ లో మాత్రం రైలు వచ్చి మనం ఆర్డర్ చేసిన భోజనాన్ని అందిస్తుంది.వావ్ .. వినడానికి చాలా బాగుంది కదా.. ఒకసారి ఆ హోటల్ పూర్తీ వివరాల గురించి తెలుసుకుందాం.మీరు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ‘ప్లాట్‌ఫామ్‌-65’ రెస్టారెంట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. థీమ్‌ బేస్డ్‌ రెస్టారెంట్లకు పెరుగుతున్న ఆదరణకు ఇదో సాక్ష్యం అని చెప్పొచ్చు. ఇక్కడ టేబుళ్లు, కుర్చీలు.. అన్నీ ట్రైన్‌లో ఉండే సీట్లలాగే ఉంటాయి. అక్కడ కూర్చుంటే మీకు ట్రైన్‌లో కూర్చున్న అనుభూతే కలుగుతుంది.

వరంగల్‌, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి గమ్యస్థానాలను స్టేషన్‌ పేర్లతో సహా రూపొందించారు. ఆయా మార్గాల్లోని పట్టణాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలను కూడా గోడలపై పెయింట్‌ చేశారు. దీంతో నచ్చిన మార్గాన్ని ఎంచుకుని.. అక్కడ కూర్చోవచ్చు. ఇక వడ్డన విషయానికొస్తే ఈ రెస్టారెంట్లో సర్వర్లకు బదులు బుల్లిబుల్లి ట్రైన్లు మనం ఆర్డర్‌ చేసిన వెరైటీలను తెచ్చి ఇస్తాయి…అయితే అక్కడ రేటు కూడా తక్కువే..ఇద్దరు మనుషులకు కేవలం 1000 రూపాయలు మాత్రమే అవుతుంది.మీరు అటు వెళితే ఒకసారి ట్రై చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version