ఈ మధ్యకాలంలో చాలా శాతం మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అయితే వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పైగా దీని వలన ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. కడుపునొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బంది ఏర్పడడం, వికారం వంటి మొదలగు సమస్యలు కూడా ఎదురవుతాయి. కొన్ని సందర్భాలలో అయితే మూత్రంలో రక్తం కూడా రావడం జరుగుతుంది. ఇంత ప్రమాదం ఉండే ఈ సమస్య ఎంతో ప్రమాదం కాకపోయినా, సరైన ట్రీట్మెంట్ అనేది ఎంతో అవసరం. ఎప్పుడైతే సరైన ట్రీట్మెంట్ తీసుకోరో అప్పుడు కొన్ని రకాల క్యాన్సర్ అభివృద్ధికి కారణం అవుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సహజంగా కిడ్నీలో రాళ్లు రావడం వలన విసర్జనలో ఇబ్బంది రావడం లేక మరింత ప్రామాదం అయితే మూత్రంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనబడతాయి. ఇదే విధంగా కొన్ని కొనసాగితే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కనుక ఈ ట్రీట్మెంట్ ను సరైన విధంగా తీసుకోవాలి. తరచుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, బరువు తగ్గడం, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనబడినప్పుడు తప్పకుండా యూరాలజిస్ట్ ను సంప్రదించాలి. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ సమస్య తీవ్రత తగ్గుతుంది.
అయితే ఈ సమస్య తగ్గడానికి తప్పకుండా నీరును ఎక్కువగా తీసుకోవాలి. కనీసం ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల వరకు నీరు తాగడం ఎంతో అవసరం. వీలైనంతవరకు రోజువారి ఆహారంలో అధిక ఉప్పు, పంచదార వంటిని తక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఉండేటువంటి నారింజ, నిమ్మకాయలు వంటి పండ్లను తప్పకుండా తినాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఉలవలు, కాకరకాయ, అరటి పండ్లు తీసుకోవడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ప్రమాదాన్ని తగ్గించాలి అంటే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గాలి. ముఖ్యంగా షుగర్, అధిక బరువు, అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించుకోవడం వలన కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.