దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఐఐ కేంద్రం ఏర్పాటుపై కీలక
ప్రకటన చేశారు. టాటా సంస్థతో కలిసి అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్ 2047 విజన్ మేరకు ముందుకు సాగుతామన్నారు.
ప్రస్తుత పోటీ రంగాల్లో రాణించాలంటే ఏఐని ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలని సూచించారు. గతంలో ఐటీ నేర్చుకుంటే మంచి ప్యూచర్ ఉంటుందని ముందే చెప్పాను. నేర్చుకున్న వారు విదేశాల్లో స్థిరపడ్డారు. నేర్చుకోని వారు స్వదేశంలోనే ఉన్నారు. ఏపీకి వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ తీసుకురావాలనేది నా లక్ష్యం. అలా తీసుకొస్తే.. చాలా మంది ఉద్యోగాలు చేసుకొని తమ పిల్లలను చూసుకుంటారని తెలిపారు సీఎం చంద్రబాబు.