తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రవాణా సంస్థ అయిన ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు నేడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. అలాగే ఆర్టీసీ డిపోల ఈ ప్రైవేటీ కరించడం ఆ సంస్థలకు పిడుగుపాటు లాంటి అంశం అన్నారు.
అలాగే ఈ నిర్ణయం ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు గొడ్డలిపెట్టు లాంటిదని దీనిని ఇప్పుడే పట్టించుకోకపోతే.. ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తారని, దీనిపై ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తాందన్నారు. అలాగే ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు తాము పోరాడుతామని ఈ పోరాటానికి కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ
అజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.