Epidermodysplasia verruciformis.. ఇది ఓ వ్యాధి పేరు. వింత వ్యాధి. చాలా అరుదైన వ్యాధి. ఆ వ్యాధి సోకితే.. చేతులు, కాళ్లు మొత్తం చెట్టు బెరడులా మారిపోతాయి. పైన చూశారుగా ఫోటో. అలా చేతి వేళ్లు, కాలి వేళ్లు పెరుగుతూ పోతూనే ఉంటాయి.
ఈ వింత వ్యాధితో బాధపడుతున్నాడు బంగ్లాదేశ్ కు చెందిన 28 ఏళ్ల అబుల్ బజందర్. శరీరంలో ఒక్కసారిగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడంతో ఇలా చేతి వేళ్లకు పులిపిర్లు పెరగడం ప్రారంభించాయి. చేతి వేళ్లు పెరగడం.. అతడికి ఆపరేషన్ చేయడం.. మళ్లీ అవి పెరగడం దీంతో.. డాక్టర్లు ఇప్పటి మొత్తం 25 ఆపరేషన్లు చేశారు. అయినప్పటికీ అవి తగ్గలేదు. మళ్లీ అబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు కూడా అతడి వ్యాధికి చికిత్సను కనుక్కోలేకపోతున్నారు. అవి పెరిగినప్పుడల్లా ఆపరేషన్ చేయడం తప్పితే వాళ్లకు మరో ఆప్షన్ లేదు. కానీ.. ఈసారి అబుల్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోయిందట.