యూఎస్ వీసా కావాలా? మీ సోషల్ మీడియా ఖాతాల వివరాలు కూడా చెప్పాల్సిందే..!

-

దేశ భద్రతే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అధికారులు చెబుతున్నారు. అందుకే.. యూఎస్‌కు వచ్చే వాళ్లకు వీసా ఇచ్చే సమయంలోనే వాళ్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే.. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయొచ్చని యూఎస్ ప్రభుత్వం భావిస్తోంది.

రోజురోజుకూ యూఎస్ వీసా పొందే ప్రొసీజర్‌ను కఠినతరం చేస్తోంది యూఎస్. ఉగ్రవాదులు, దేశాన్ని నాశనం చేయడం కోసం యూఎస్‌లో ప్రవేశించాలనుకునేవాళ్లకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో యూఎస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. అప్లికేషన్‌తో పాటు.. తాము వాడే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఖాతాల వివరాలు చెప్పాల్సిందేనని కొత్త రూల్ తీసుకొచ్చారు. గత శనివారం నుంచే ఈ నిబంధన అమలులోకి వచ్చింది.

దేశ భద్రతే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అధికారులు చెబుతున్నారు. అందుకే.. యూఎస్‌కు వచ్చే వాళ్లకు వీసా ఇచ్చే సమయంలోనే వాళ్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే.. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయొచ్చని యూఎస్ ప్రభుత్వం భావిస్తోంది. తాత్కాలిక పర్యటన కోసం యూఎస్ వెళ్లే వాళ్లు అయినా సరే.. ఇంకెవరైనా సరే.. సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలు వెల్లడిస్తేనే వాళ్ల వీసా ప్రాసెస్ అవుతుంది. లేదంటే వీసాను నిర్దందంగా తిరస్కరిస్తారు.

ఒకవేళ వాళ్లకు నిజంగా సోషల్ మీడియాలో ఏ ఖాతా లేకపోతే.. లేవనే విషయాన్ని అక్కడ పొందుపర్చాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో కూడా ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆసక్తికి గురిచేస్తోంది. అయితే.. ఈ రూల్‌కు సంబంధించిన ఉత్తర్వులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2017 మార్చిలోనే రిలీజ్ చేయగా… దీని సాధ్యాసాధ్యాలు, అమలు, మార్పులు చేర్పులు చేయడాన్ని 2018 మార్చిలో యూఎస్ విదేశాంగ శాఖ ప్రారంభించి.. ఇప్పటికి ఆ రూల్‌ను అమలులోకి తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version