FaceApp ఫేస్‌యాప్‌తో డేంజర్‌లో మీ పర్సనల్‌ డాటా..

-

ఫేస్‌యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన కంపెనీ పేరు వైర్‌లెస్ ల్యాబ్‌. ఇది ర‌ష్యాకు చెందిన కంపెనీ. దీంతో అమెరికా ర‌క్ష‌ణ శాఖ ఈ విష‌యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

యంగ్‌గా ఉన్న వారిని ముస‌లివారిగా మార్చి చూపించే ఫేస్‌యాప్‌.. సోష‌ల్ మీడియా సృష్టిస్తున్న ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. చాలా మంది ఈ యాప్ స‌హాయంతో త‌మ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసుకుని తాము వృద్ధాప్యంలో ఎలా ఉంటామో చూసుకుంటూ ఆనందిస్తున్నారు. అంతేకాదు.. ఆయా ఫొటోల‌ను పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వారు షేర్ కూడా చేస్తున్నారు. దీంతో రోజు రోజుకీ ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్న‌వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్ప‌టికే ఫేస్ యాప్‌ 10వేల కోట్ల‌కు పైగా డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకోగా.. ఇంకా ఈ సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఫేస్‌యాప్‌కు చెందిన ఒక విష‌య‌మే.. ఇప్పుడు అమెరికాకు నిద్ర లేకుండా చేస్తోంది.. అదేమిటంటే…

ఫేస్‌యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన కంపెనీ పేరు వైర్‌లెస్ ల్యాబ్‌. ఇది ర‌ష్యాకు చెందిన కంపెనీ. ఈ క్ర‌మంలోనే ఈ యాప్‌లో కొన్ని కోట్ల మంది అమెరికన్లు ఇప్ప‌టికే త‌మ త‌మ ఫొటోల‌ను అప్‌లోడ్ చేసి యాప్‌ను ఉప‌యోగించుకున్నారు. దీంతో అమెరికా ర‌క్ష‌ణ శాఖ ఈ విష‌యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. అమెరికాకు చెందిన పౌరుల డేటా, ఫొటోలు పెద్ద ఎత్తున ఓ ర‌ష్యాకు చెందిన కంపెనీ చేతుల్లో ఉన్నాయ‌ని వాపోతోంది. అయితే.. ఇంత‌కీ అస‌లు అమెరికా ఆందోళ‌న చెందడంలో నిజంగానే అర్థ‌ముందా.. అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

ఫేస్‌యాప్‌.. యాప్‌ను ఉప‌యోగించుకోవాలంటే.. ముందుగా ఆ యాప్‌లోకి లాగిన్ అవ్వ‌గానే ఆ కంపెనీ పెట్టే ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌కు ఒప్పుకోవాలి. వాటిల్లో ఉన్న ఒక ముఖ్య‌మైన కండిష‌న్ ఏమిటంటే.. మ‌నం ఫేస్‌యాప్‌లోకి అప్‌లోడ్ చేసే ఫొటో ఏదైనా స‌రే.. లేదా మ‌న డేటా అయినా స‌రే.. వాటిని ఎలాగైనా ఉపయోగించుకునేందుకు ఆ యాప్‌కు సర్వాధికారాలు ఉంటాయ‌న్న‌మాట‌. మ‌నం యాప్‌ను ఉప‌యోగించుకునేందుకు ముందుగానే ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌కు ఒప్పుకుంటాం క‌నుక‌.. మ‌న‌మే మ‌న ఫొటోలు, డేటాను ఎలాగైనా వాడుకోవ‌చ్చ‌ని చెబుతూ ఆ ట‌ర్మ్స్‌కు ఒప్పుకుంటున్నాం. క‌నుక ఆపై ఆ కంపెనీకి మ‌న ఫొటోలు, డేటాను ఏమైనా చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అంటే వారు ఆ డేటాను అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ల‌కు వాడ‌వ‌చ్చు. లేదా దాన్ని ఇత‌రుల‌కు అమ్ముకోవ‌చ్చ‌న్న‌మాట‌. అందుక‌నే ఈ విష‌యంపై అమెరికా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. మ‌రి ఈ యాప్‌పై అమెరికా ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news