ప్రేమికుల రోజు.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

-

ప్రేమ.. ఈ ప్రపంచంలో ఉన్న ఉన్న ప్రతీ జీవరాశి కోరుకునేది ఇదే. ప్రకృతిలో ప్రేమ లేకపోతే ఈ రోజు మనమంతా ఇక్కడ ఉండేవారమే కాదు. ఆది మానవుడి నుండి ఇప్పటి దాకా మనల్ని నడిపించింది ప్రేమే. అది ప్రకృతితో మన ప్రేమ అయినా కావచ్చు. మన మీద ప్రకృతి ప్రేమ అయినా కావచ్చు. ఐతే ప్రేమికుల రోజు అనగానే ఆడా, మగా మధ్య ప్రేమ మాత్రమే గుర్తుకు వస్తుంది. తాము ప్రేమించిన వారికి అందమైన బహుమతులు అందించి, తమలోని ఎదుటివారిపై ఉన్న ప్రేమని తెలియజేయడమే ప్రేమికుల రోజు ప్రధాన లక్ష్యం.

ముందే చెప్పినట్టు ఆడా, మగా అనే కాదు ప్రేమని ఎవరి పట్లయినా తెలియజేయాలి. ఒంటరిగా కూర్చున్న ఒక వృద్ధుడు తనని పలకరించే వారికోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ ఒక్క పలకరింత చాలు అతన్ని చాలా రోజులు బ్రతికించడానికి. ఆ పలకరింత అందించే వారే ప్రేమికులు.

ఐతే ప్రేమికుల రోజున మీరు ప్రేమించిన వారికి దూరంగా ఉన్నారా? మీ బహుమతిని మాటల ద్వారా అందించి, మీలో ప్రేమని తెలియజేయడానికి ఇక్కడ కొన్ని కొటేషన్లు ఉన్నాయి.

నువ్వు లేకపోతే నా జీవితం ఇంత అందంగా ఉండేది కాదు.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

నా కలలన్నీ నీకోసమే. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే అవి తీరాయి.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

నీపై ఉన్న ప్రేమని ఎలా వెల్లడిచేయాలా అని ఎదురుచూస్తున్నాను. ప్రేమికుల రోజు కంటే పర్వదినం మరోటి లేదని, ఈ రోజున చెప్తే నువ్వు కాదనవనే నమ్మకంతో నాలోంచి నీపై పుట్టిన ప్రేమని ప్రేమగా తెలియజేస్తూ.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version