మరణం ఇది ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో ఎవరు ఊహించి చెప్పలేరు. మనిషి చనిపోయే ముందు అతని కళ్ళ ముందు ఏం కనపడుతుంది అన్నది స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. మరణం సహజంగా జరగొచ్చు ప్రమాదవశాత్తు జరగవచ్చు. చనిపోయే ముందు మనిషి కళ్ళ ఎదురుగా,ఏం చూస్తాడు అనేది శాస్త్రవేత్తలే కాక తత్వవేత్తలు కూడా ఆలోచింపజేసే ప్రశ్న. దీని సమాధానంగా కొంతమంది కొన్ని కోణాల్లో విశ్లేషించి చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఆ వివరాలు చూద్దాం..
శాస్త్రీయ కోణంతో చూస్తే : శాస్త్రీయంగా మనిషి చివరి క్షణాల్లో శరీరం మెదడు పనితీరు గణనీయంగా మారిపోతుంది మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.నురాన్లు పనిచేయడం నెమ్మదిస్తుంది. కొందరు వ్యక్తులు వివిధ రకాల అనుభవాలను గుర్తించినట్టు కొంత అధ్యయనాలు చెబుతున్నాయి.
మనిషి సహజంగా మరణించవచ్చు, లేదా ప్రమాదవశాత్తు మరణించవచ్చు సహజంగా మరణించినప్పుడు ఒక మనిషి 70 నుండి 80 సంవత్సరాలు జీవించి ఉంటే, ఆ మనిషి చనిపోయే ముందు, మెదడు ఆక్సిజన్ లోపం వల్ల వ్యక్తులు తెల్లని కాంతిని, లేదా చీకటిని చూస్తారుట. కొంతమందికి జీవితంలోని జ్ఞాపకాలు గుర్తుకు రావడం చివరిసారి ఇష్టమైన వారిని, ఆ మనిషి కావాలనుకుంటున్న వారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది.ఎదురుగా ఎవరు వున్నా అది వారి జీవిత భాగస్వామి,పిల్లలు,స్నేహితులు ఎవరైనా కావచ్చు వారిని చూస్తూ మరణించడం జరుగుతుంది.
అదే మనిషి ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ ప్రమాదం జరిగినప్పుడు మెదడు షాక్ గురవుతుంది. శరీరం ఇక ఏమీ పనిచేయదు మెదడు పనితీరు తగ్గిపోవడంతో శరీర భాగాలు అన్నీ కూడా పనిచేయకుండా పోయి కోమాలోకి వెళ్ళిపోతాడు. ప్రమాదం జరిగి చనిపోయేటప్పుడు ఆ వ్యక్తి చనిపోయేముందు అతనికి ఏమీ కనపడడానికి ఆస్కారం ఉండదు కోమా లోనే చనిపోవడం జరుగుతుంది. కొంతమంది ప్రమాదం తీవ్రంగా జరిగినప్పుడు ఆ వెంటనే అక్కడికక్కడే బ్రెయిన్ షాక్ కి గురై మరణించడం జరుగుతుంది.
ఆధ్యాత్మిక కోణం : మనిషి మరణించే ముందు ఏం చూస్తాడు అనేది ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే వివిధ సంస్కృతులు వివిధ మతాలవారు చనిపోయే సమయంలో జరిగే అనుభవాలు ఒక్కో విధంగా ఉంటాయి. ముఖ్యంగా హిందూ ధర్మం ప్రకారం వారి మతంలో ఎవరైనా చనిపోతే చివరి క్షణాలలో ఆత్మ శరీరాన్ని వదిలి మరో లోకానికి లేదా పునర్జన్మకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో వ్యక్తి తన జీవితంలో చేసిన కర్మలను గుర్తు చేసుకుంటాడు. చనిపోయే ముందు కొంతమందికి దేవదూతలు,కొంతమందికి యమదూతలు కొంతమందికి,పితృదేవతలు కనిపిస్తారని హిధువులు నమ్ముతారు.
మనిషి చనిపోయే ముందు ఏం చూస్తాడు అనే ప్రశ్నకు శాస్త్రీయ సమాచారం స్పష్టంగా లేదు. కేవలం ఆధ్యాత్మిక శాస్త్రీయ దృక్పదలలో వ్యక్తుల నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
Note: కేవలం పైన ఇవ్వబడిన సమాచారం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది.